IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యం స్పందిస్తూ డేవిడ్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై భారీ జరిమానా విధించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినందుకు టిమ్ డేవిడ్ తన మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. అసభ్యకరమైన లేదా అవమానకరమైన సంజ్ఞలు, ఓవర్ యాక్షన్ చేసినందుకు గాను రెండు డెమెరిట్ పాయింట్లు సైతం విధించింది. టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించడంతో ఈ శిక్షను ఖరారు చేశారు. ప్రస్తుతం అతను సస్పెన్షన్‌కు చేరువలో ఉన్నాడు. మరో డెమెరిట్ పాయింట్ వస్తే ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది.
డేవిడ్ మాత్రమే కాదు.. ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ సైతం క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొవడం గమనార్హం. ఫోర్త్ అంపైర్‌తో దూకుడుగా వ్యవహరిస్తూ, అసభ్య పదజాలం (Audible obscenity) వాడినందుకు గానూ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అల్లా గజన్ఫర్ బౌలింగ్ సమయంలో క్రునాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఫ్లవర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ అంశాన్ని ఐపీఎల్ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ ఆఖరి బంతికి విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు, చివరి బంతికి రాసిఖ్ సలామ్ తీసిన డబుల్ రన్ తో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లడమే కాకుండా.. ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ను అధికారికంగా తప్పించింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!