SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విద్వంసం సృష్టించారు. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో పరుగుల వరద పారించిన ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు, కేవలం 3 ఓవర్లలోనే జట్టు స్కోరును యాభై మార్కు దాటించి సరికొత్త రికార్డును నెలకొల్పారు.
IPL చరిత్రలో SRH అత్యంత వేగవంతమైన 50 పరుగులు ఇలా ఉన్నాయి. 2.4 ఓవర్లలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై (ఢిల్లీ, 2024), 3.1 ఓవర్లలో.. లక్నో సూపర్ జెయింట్స్‌పై (హైదరాబాద్, 2024), ఇప్పుడు ఈ మ్యాచ్ లో 3.2 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్‌పై (హైదరాబాద్, 2026) 50 పరుగులు సాధించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
పవర్ ప్లే ముగిసేసరికి విధ్వంసకర స్కోరు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి బంతి నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి SRH 79/1 పొజిషన్లో ఉంది. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 35 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ఔట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 35 పరుగులు, ఇషాన్ కిషన్.. 7 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అభిషేక్ శర్మ 3.3 ఓవర్ల వద్ద 54 పరుగుల స్కోరు వద్ద మొదటి వికెట్‌గా వెనుదిరిగినప్పటికీ, అప్పటికే జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 ఓవర్లలో 27 పరుగులు, మార్కో జాన్సెన్ 2 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకున్నారంటే హైదరాబాద్ బ్యాటర్ల ధాటి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ ప్లేలోనే 79 పరుగులు సాధించిన సన్ రైజర్స్, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా సాగుతోంది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!