Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్‌పై కఠిన చర్యలు.. ఊహించని విధంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా జరిమానాకు గురయ్యారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ వాడుతూ కెమెరాకు చిక్కడం చర్చనీయాంశమైంది. క్రీడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి ఆట ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను బీసీసీఐ ఈ చర్యలు తీసుకుంది. పరాగ్ తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ అతనికి శిక్ష ఖరారు చేశారు. రియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా, ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం.. ఆట గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం నేరం. డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ వాడటం ఈ పరిధిలోకి వస్తుంది.
కొద్దిరోజుల క్రితమే రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ కూడా నిబంధనలు అతిక్రమించి డగౌట్‌లో ఫోన్ వాడటంతో లక్ష రూపాయల జరిమానా ఎదుర్కొన్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై, అధికారులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా బీసీసీఐ ఆలోచిస్తోంది. మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణతో ఉండాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని బోర్డు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పరాగ్ వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!