MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఈ సీజన్ ముంబైకి ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏకంగా ఆరు ఓటములతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన పాండ్యా, ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాక ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అభిమానుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్, ఇప్పుడు జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు.
మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ముంబై జట్టులో మార్పులు చేయాలనుకుంటే ముందుగా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒకవేళ హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటే.. అతన్ని జట్టు నుంచి పూర్తిగా రిలీజ్ చేయడం మంచిదని సలహా ఇచ్చారు. కెప్టెన్సీ పోయాక అతను అదే జట్టులో సాధారణ ఆటగాడిగా ఎంతవరకు రాణించగలడో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తడబడుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఒత్తిడిలో తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 243 పరుగులు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయింది. బుమ్రా వంటి స్టార్ బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు ప్రదర్శనపై హార్దిక్ అసహనం వ్యక్తం చేశాడు. తాము నిర్దేశించుకున్న ప్రమాణాలకు తగ్గట్లుగా ఆడటం లేదని ఒప్పుకున్నాడు. బౌలింగ్ విభాగంలో వనరులు తక్కువగా ఉన్నాయని, ఒత్తిడిలో తప్పులు చేస్తున్నామని అతను తెలిపాడు.
ముంబై భవిష్యత్తు ఏమిటి..?
ముంబై ఇండియన్స్ చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోంది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా జట్టును ఏకం చేయడంలో విఫలమవుతున్నాడని మాజీలు అంటున్నారు. వచ్చే సీజన్‌లో మెగా వేలం ఉండటంతో.. ముంబై యాజమాన్యం హార్దిక్‌ను అట్టిపెట్టుకుంటుందా లేక కొత్త కెప్టెన్ కోసం వెతుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న స్థితిలో ప్లే ఆఫ్స్ చేరడం ముంబైకి అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అద్భుతం జరిగి మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తన ఆటను, కెప్టెన్సీని హార్దిక్ మళ్ళీ గాడిలో పెట్టుకుంటాడో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
-
Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
-
EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!