Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలెక్షన్‌కు బలమైన పోటీదారుగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాటిదార్, 18 ఏళ్ల ఫ్రాంచైజీ నిరీక్షణకు తెరదించుతూ జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. ఈ సీజన్లోనూ జట్టును వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేర్చడమే కాకుండా, బ్యాటర్‌గా తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ సీజన్ 14 మ్యాచ్‌ల్లో 196.76 స్ట్రైక్ రేట్‌తో, 44.18 సగటుతో 486 పరుగులు చేశాడు. ఇందులో క్వాలిఫయర్-1 లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 33 బంతుల్లోనే సాధించిన 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కూడా ఉంది.
అయితే, ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా టీ20 జట్టులో చోటుపై ప్రశ్నించగా.. పాటిదార్ చాలా నిర్మొహమాటంగా సమాధానమిచ్చాడు. తాను ప్రస్తుతం భారత జట్టు సెలెక్షన్ గురించి అస్సలు ఆలోచించడం లేదని, తన దృష్టి అంతా ఫైనల్ పైనే ఉందని స్పష్టం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరగబోయే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో ఆర్సీబీ ఆడుతున్న భయం లేని, హై-రిస్క్ క్రికెట్ కారణంగా పేపర్‌పై బెంగళూరు జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
విరాట్ కోహ్లీ, దేవదూత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. పిచ్ ఎలా ఉన్నా, ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలు ఏవైనా సరే.. వీరంతా ఒకే గేర్‌లో ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారు. ఈ సీజన్లో మరే జట్టు కూడా ఆర్సీబీ తరహాలో ఇన్ని సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించలేదు. గత రెండు సీజన్లుగా రజత్ పాటిదార్ ప్రశాంతమైన కెప్టెన్సీ జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చింది. విరాట్ కోహ్లీ లేదా డుప్లెసిస్ లాగా మైదానంలో దూకుడు ప్రదర్శించకపోయినా, 32 ఏళ్ల పాటిదార్ తన ప్రశాంతతతో జట్టులోని ఇటు సూపర్స్టార్లను, అటు యువ ఆటగాళ్లను సమర్థవంతంగా నడిపిస్తున్నాడు.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!