IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే పరుగుల వరద.. సిక్సర్ల మోత.. బౌండరీల పండుగ.. వికెట్ల జాతరలా ఉంటుంది.. అయితే, వీటన్నింటకి మించి.. కెప్టె్న్ తీసుకునే నిర్ణయాలు.. గెలుపోటములను నిర్ణయిస్తాయి.. టాస్ గెలవడం నుండి.. బ్యాటింగా..? బౌలింగా? ఎంచుకోవడం.. పరిస్థితిని అనుగుణంగా.. బ్యాటర్లను దించడం.. బౌలర్లను మార్చడం.. జట్టు కోసం.. బ్యాట్, బాల్‌తో సత్తా చాటడం అన్నీ ఉంటాయి.. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ మూడో వంతు పూర్తయ్యేసరికి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈసారి ఆటగాళ్ల కంటే కెప్టెన్లపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. భారీ అంచనాలు, కోట్ల రూపాయల ధరలు, స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ పలువురు కెప్టెన్లు తమ ఫామ్‌తో పాటు నాయకత్వంలో కూడా నిరాశపరుస్తున్నారు. పరుగులు చేయలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, జట్టు సమతుల్యత కోల్పోవడం వంటి సమస్యలు అనేక ఫ్రాంచైజీలను వెనక్కి నెడుతున్నాయి.
రుతురాజ్ గైక్వాడ్.. సీఎస్కేలో నాయకత్వ సంక్షోభమా?
రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఏడు మ్యాచ్‌లలో కేవలం 104 పరుగులు మాత్రమే చేసిన గైక్వాడ్ సగటు 14.85గా ఉంది. వ్యక్తిగత ఫామ్ మాత్రమే కాకుండా, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్స్‌లో కూడా స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎప్పుడూ స్థిరత్వానికి పేరుగాంచిన సీఎస్కే ఈసారి ఒత్తిడిలో కనిపిస్తోంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
హార్దిక్ పాండ్యా.. మూడు విభాగాల్లోనూ ప్రభావం తగ్గిందా?
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఆరు ఇన్నింగ్స్‌లలో 97 పరుగులు, బంతితో కేవలం మూడు వికెట్లు మాత్రమే సాధించాడు. టాప్ ఆర్డర్లోనా, ఫినిషర్‌గా ఆడాలా అన్న స్పష్టత లేకపోవడం, బౌలింగ్‌లో కూడా సరైన పాత్ర లేకపోవడం ముంబై జట్టును బలహీనపరిచినట్లు కనిపిస్తోంది.
అజింక్య రహానే.. అనుభవం ఉన్నా దిశ కనిపించడంలేదు
అజింక్య రహానే నాయకత్వంలోని Kolkata Knight Riders కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఏడు మ్యాచ్‌లలో 152 పరుగులు చేసిన రహానే వరుసగా రెండు డక్‌లు నమోదు చేశాడు. జట్టు ఆటను నియంత్రించకుండా కేవలం పరిస్థితులకు స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రిషబ్ పంత్.. భారీ ధర, భారీ ఒత్తిడి
రిషబ్ పంత్ ఈ సీజన్లో అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాళ్లలో ఒకడు.. ఏడు మ్యాచ్‌లలో 147 పరుగులు చేసిన పంత్ ఒకే ఒక్క పెద్ద ఇన్నింగ్స్ మినహా మిగతా మ్యాచ్‌లలో ప్రభావం చూపలేకపోయాడు. దూకుడు ఉన్నా, నిలకడ లోపించడంతో జట్టు కూడా వెనుకబడుతోంది.
రియాన్ పరాగ్.. కెప్టెన్ విఫలం, జట్టు సక్సెస్
రియాన్ పరాగ్ నేతృత్వంలోని Rajasthan Royals మాత్రం మంచి స్థానంలో కొనసాగుతోంది. కానీ, పరాగ్ ఏడు మ్యాచ్‌లలో కేవలం 81 పరుగులు చేసినా, జట్టు మొత్తం ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇది బలమైన జట్టు కెప్టెన్ బలహీనతలను ఎలా కప్పిపుచ్చగలదో చూపిస్తోంది.
శుభ్‌మన్ గిల్.. కెప్టెన్ రాణించినా జట్టు వెనుకబాటు
శుభ్‌మన్ గిల్ వ్యక్తిగతంగా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆరు మ్యాచ్‌లలో 297 పరుగులు, 49.50 సగటు, 149.24 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అయినప్పటికీ Gujarat Titans ఆశించిన స్థాయిలో పాయింట్ల పట్టికలో లేదు. బలహీన మిడిల్ ఆర్డర్, బౌలింగ్ సహకారం లేకపోవడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
కెప్టెన్ ముఖ్యమా? వ్యవస్థ ముఖ్యమా?
ఐపీఎల్ 2026 ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. కేవలం కెప్టెన్ ప్రతిభతో జట్టు గెలవదు. బలమైన జట్టు ఉంటే కెప్టెన్ బలహీనతలు దాచిపెట్టవచ్చు. కానీ జట్టు బలహీనంగా ఉంటే స్టార్ కెప్టెన్ కూడా ఒంటరిగా ఏమీ చేయలేడు. ఈ సీజన్లో పేరు కంటే ప్రభావమే ముఖ్యం అని మరోసారి తేలిపోయింది. పెద్ద పేర్లు ఉన్నా, ఫలితాలు లేకపోతే విమర్శలు తప్పవు. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో ఈ కెప్టెన్లు ఎలా పుంజుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..