Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకడమే కాకుండా తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజెంటేషన్‌లో హార్దిక్ జట్టు తప్పులను ఒప్పుకున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో బౌలర్లకు పిచ్ అనుకూలించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. “ఈ మ్యాచ్ చాలా ఎంటర్టైనింగ్గా సాగింది. కానీ బ్యాటింగ్‌లో మేము తడబడ్డాం. మేము ఖచ్చితంగా ఒక 20 పరుగులు తక్కువ చేశాం. పవర్‌ప్లేలోనే మేము చాలా వికెట్లు కోల్పోయాం. ఒకవేళ తిలక్ వర్మ, నేను క్రీజులో ఎక్కువసేపు నిలిచి, మరికొన్ని భాగస్వామ్యాలు (partnerships) నెలకొల్పి ఉంటే.. ఆ అదనంగా 15-20 పరుగులు వచ్చేవి. అప్పుడు మాకు గెలిచేందుకు మంచి అవకాశం ఉండేది” అని హార్దిక్ పాండ్యా విశ్లేషించాడు.
ఇక పిచ్ ఎలా ఉందనే ప్రశ్నకు హార్దిక్ స్పందిస్తూ.. “నిజాయితీగా చెప్పాలంటే.. బౌలర్లకు ఈ పిచ్ అద్భుతంగా ఉంది. ఇలాంటి పిచ్‌లపై ఆడటం నాకు ఇష్టమే. ప్రస్తుత ఐపీఎల్ పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యంగా మారిపోతోంది. దీనివల్ల బౌలర్లు చాలా నిస్సహాయంగా ఫీలవుతున్నారు. కానీ ఈరోజు మ్యాచ్‌లో పిచ్ నుంచి బౌలర్లకు కూడా మంచి సపోర్ట్ దొరికింది. దాంతో అద్భుతంగా బౌలింగ్ వేయగలిగారు. బ్యాట్స్‌మెన్స్ సైతం చక్కటి ప్రదర్శన కనబరిచి పరుగులు చేయాల్సి వచ్చింది. అందుకే ఈ పిచ్‌పై ఆడటాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను” అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ముంబై జట్టు ఫీల్డింగ్ పట్ల హార్దిక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్ మొత్తం తమ ఫీల్డింగ్ చాలా అధ్వాన్నంగా ఉందన్నాడు. తాము చాలా క్యాచ్‌లు వదిలేశామని గుర్తు చేసుకున్నాడు. నిజానికి క్యాచ్‌లు ఎవరూ కావాలని వదలరు, కానీ ఈ సీజన్లో మా ఫీల్డింగ్ సరిగ్గా లేదన్నాడు. తప్పు ఒప్పుకోవడం తప్ప తప్పించుకోవడానికి ఎలాంటి సాకులు లేవని ఓపెన్‌గా చెప్పాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే క్యాచ్‌లను వదిలేసినప్పుడు గెలవడం అంత సులువు కాదని హితవు పలికాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
-
Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
-
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..
-
Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!