CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Playoff Chances: ఈ సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం (మే 15) జరిగిన తమ 12వ లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో చెన్నై నాకౌట్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ రివర్స్ ఫిక్చర్‌లో లక్నోను ఓడించి టాప్-4 లోకి దూసుకెళ్లాలని భావించిన సీఎస్కే ఆశలపై మిచెల్ మార్ష్ నీళ్లు చల్లాడు. చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని మార్ష్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈజీగా ఛేజ్ చేశాడు. సీఎస్కే బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. ఏ బౌలర్‌నూ వదల్లేదు సరే కదా, ముఖ్యంగా చెన్నై స్టార్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను టార్గెట్ చేస్తూ కేవలం 10 బంతుల్లోనే వరుసగా నాలుగు సిక్సర్లతో సహా మొత్తం 32 పరుగులు పిండుకున్నాడు. మార్ష్ మ్యాచ్‌ను ముగించకుండానే అవుట్ అయినప్పటికీ, అప్పటికే చెన్నైకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత సీఎస్కే వరుసగా మూడు వికెట్లు తీసి లక్నోను కాస్త భయపెట్టినా, నికోలస్ పూరన్ రంగంలోకి దిగి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లోనే వరుసగా నాలుగు సిక్సర్లు బాది లక్నోను సునాయాసంగా గెలిపించాడు.
ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం సీఎస్కే ఖాతాలో 12 మ్యాచ్‌లకు గానూ 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే చెన్నై ముందున్న సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. సీఎస్కే ఆడబోయే మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మరొకటి గుజరాత్ టైటాన్స్‌తో వారి హోమ్ గ్రౌండ్లో జరగనుంది. చెన్నై గనుక ఈ మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే, మరో నాలుగు జట్లు సైతం 16 కంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉన్నందున చెన్నైకి అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు కాలేదు. కానీ.. వేరే జట్ల ఫలితాలు నాటకీయంగా మారితే 16 పాయింట్లతో చెన్నై దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ చెన్నై కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి 14 పాయింట్ల వద్దే నిలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది! కానీ అప్పుడు దానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తమ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలి, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవాలి. ఒకవేళ ఢిల్లీ రెండు మ్యాచ్‌లూ గెలిచినా, వారి నెట్ రన్‌రేట్ (NRR) చెన్నై కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే చెన్నై ప్లేఆఫ్స్‌కి చేరుకుంటుంది. ఈ సమీకరణాలు చూస్తుంటే ప్రస్తుతం చెన్నై భవితవ్యం పూర్తిగా వారి చేతుల్లో లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!