Site icon NTV Telugu

Ruturaj Gaikwad: “ఆ 2 ఓవర్లే మా కొంపముంచాయి”.. సన్‌రైజర్స్‌తో ఓటమిపై రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad Speech

Ruturaj Gaikwad Speech

Ruturaj Gaikwad: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు చెతికల పడిపోయింది. టీమ్ పుంజుకుంటుంది అనుకులోనే దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కీలక సమయాల్లో విఫలమవుతుండటం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ లేకపోవడం ఛేదన సమయంలో స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్యాన్ని చేరుకోవడంలో జట్టు తడబడుతుండటంతో పాటు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ పరాజయం తర్వత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ విధ్వంసకరంగా బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూనే తమ జట్టు బౌలర్ల ప్రదర్శనను మెచ్చుకున్నాడు.

READ MORE: Char Dham Yatra: హిమాలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు!

“పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ మంచి జోరు కనబరిచింది. స్కోరు 220-230 దాటుతుందని అనుకున్నాను. కానీ మా బౌలర్లు పుంజుకుని హైదరాబాద్‌ను 200 పరుగుల లోపే కట్టడి చేశారు. ఇది నిజంగా గొప్ప విషయం. కానీ.. బ్యాటింగ్‌లో పది ఓవర్ల వరకు పటిష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత జరిగిన తప్పిదాలే దెబ్బతీశాయి. చివరి 10 ఓవర్లలో మాకు కేవలం 80 పరుగులే అవసరమయ్యాయి. ఆ సమయంలో ఒకటి రెండు భాగస్వామ్యాలు నెలకొల్పితే గెలిచేవాళ్లం. కానీ 10 ఓవర్ల తర్వాత వరుసగా రెండు ఓవర్లలో కేవలం 4 పరుగులే రావడం మ్యాచ్‌ను క్లిష్టంగా మార్చేసింది. చివరి ఓవర్లలో 12-13 రన్ రేట్ సాధించడం ఎవరికైనా కష్టమే” అని రుతురాజ్ విశ్లేషించాడు. పవర్‌ప్లేలో తమ బౌలర్లు పక్కా ప్లాన్‌తోనే బౌలింగ్ చేసినా, అభిషేక్ శర్మ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ వల్ల పరుగులు వెల్లువెత్తాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ప్రదర్శనపై రుతురాజ్ ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. డెత్ ఓవర్లలో అన్షుల్ చూపిస్తున్న పరిణతి, స్పష్టత జట్టుకు కలిసొచ్చే అంశమని చెప్పాడు.

Exit mobile version