IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల
- ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు రెండు వేదికలు
- ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చేసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను ఈరోజు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్‌కు బెంగళూరు కాకుండా.. అహ్మదాబాద్‌ను ఎంపిక చేయడం విశేషం. దక్షిణ భారతంలో ఒక్క నాకౌట్ మ్యాచ్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు రెండు వేదికలను (ధర్మశాల, చండీగఢ్) మాత్రమే బీసీసీఐ కేటాయించింది.
సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను గత సీజన్ విజేత జట్టు హోమ్ గ్రౌండ్లో నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గత సీజన్ విజేతగా నిలవడంతో.. చిన్నస్వామి స్టేడియం ఫైనల్‌కు వేదిక కావాల్సింది. అయితే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయింది. కొన్ని పరిపాలనా, లాజిస్టిక్ కారణాల వల్ల ఈ మార్పు చేయాల్సి వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది. స్థానిక అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని అవసరాలు తమ మార్గదర్శకాల పరిధికి బయట ఉండటంతో బెంగళూరులో ఫైనల్ నిర్వహించడం సాధ్యపడలేదని పేర్కొంది. దీంతో ఫైనల్‌ను అహ్మదాబాద్‌కు మార్చినట్లు స్పష్టం చేసింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోదీ స్టేడియం వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026 లీగ్ దశలో 70 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు టోర్నమెంట్ కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. టాప్-2 జట్లు తలపడే క్వాలిఫయర్-1 మ్యాచ్ మే 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఎల్ మైదనంలో జరగనుంది. ఈ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మే 27న న్యూ చండీగఢ్‌లోని స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. పాయింట్ల పట్టికలో మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు ఈ మ్యాచ్‌లో తలపడతాయి. ఇదే వేదికపై మే 29న క్వాలిఫయర్-2 కూడా ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతతో పోటీ పడుతుంది.
ఇక ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించనుంది. ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించబడటం ప్రత్యేకతగా నిలుస్తోంది. బెంగళూరులో ఫైనల్ జరగకపోయినా.. అహ్మదాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలే మరోసారి క్రికెట్ అభిమానులకు విశేష అనుభూతిని అందించనుంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!