IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్‌కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
- టైటిల్ కోసం తలపడనున్న ఆర్సీబీ, జీటీ
- మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే మూడు ప్లేయర్ బ్యాటిల్స్
- విరాట్ కోహ్లీ vs కగిసో రబాడా, జేసన్ హోల్డర్
- శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ vs భువనేశ్వర్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL2026 Final Key Battles: రెండు నెలలకు పైగా క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుండగా.. ఫైనల్ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ, జీటీ జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఒకవైపు రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్‌పై కన్నేయగా.. మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే మూడు కీలక ప్లేయర్ బ్యాటిల్స్పై అందరి దృష్టి నిలిచింది. మూడు కీ ప్లేయర్స్ బ్యాటిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
విరాట్ కోహ్లీ vs కగిసో రబాడా, జేసన్ హోల్డర్:
ఆర్సీబీ విజయావకాశాలు ఎక్కువగా విరాట్ కోహ్లీ ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఫైనల్లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. అయితే గుజరాత్ పేస్ బౌలర్లు కగిసో రబాడా, జేసన్ హోల్డర్ అతడికి గట్టి సవాల్ విసరనున్నారు. గణాంకాల పరంగా చూస్తే హోల్డర్ ఇప్పటివరకు కోహ్లీని నాలుగు సార్లు ఔట్ చేశాడు. రబాడా అయితే ఐదు సార్లు కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. దీంతో ఈ పోరు ఫైనల్లో అత్యంత ఆసక్తికరమైన సమరంగా మారనుంది. ఒత్తిడిని తట్టుకుని కోహ్లీ ఎలా ఆడుతాడన్నది కీలకంగా మారింది.
శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ vs భువనేశ్వర్ కుమార్:
గుజరాత్ టైటాన్స్ విజయాల్లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై ఈ జోడీ తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఫైనల్‌కు చేర్చింది. అయితే ఫైనల్లో వీరికి ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నుంచి కఠిన పరీక్ష ఎదురుకానుంది. భువీ ఇప్పటివరకు గిల్‌ను ఆరు సార్లు, సుదర్శన్‌ను ఏడు సార్లు ఔట్ చేశాడు. కొత్త బంతితో స్వింగ్‌ను రాబట్టే భువనేశ్వర్.. జీటీ ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌కు పంపగలిగితే మ్యాచ్‌పై ఆర్సీబీ పట్టు సాధించే అవకాశం ఉంటుంది.
దేవదత్ పడిక్కల్ vs రషీద్ ఖాన్:
ఫైనల్లో మరో ఆసక్తికర పోరు ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మధ్య జరగనుంది. సీజన్ ఆరంభంలో అంతగా ప్రభావం చూపకపోయినా.. రషీద్ కీలక దశలో మళ్లీ తన లయను అందుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 19 వికెట్లు పడగొట్టి జీటీ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పడిక్కల్‌పై రషీద్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో అతడిని ఐదు సార్లు ఔట్ చేశాడు. దీంతో ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రషీద్‌ను సమర్థంగా ఎదుర్కొంటే పడిక్కల్ ఆర్సీబీకి కీలక పరుగులు అందించగలడు.
ఫైనల్లో తేడా తెచ్చే పోరులు:
ఐపీఎల్ ఫైనల్స్‌లో చిన్న చిన్న క్షణాలే మ్యాచ్‌ను మలుపుతిప్పుతాయి. కోహ్లీ-రబాడా పోరు, గిల్-సుదర్శన్లకు భువనేశ్వర్ విసిరే సవాల్, పడిక్కల్-రషీద్ మధ్య జరిగే సమరం ఈ గ్రాండ్ ఫైనల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కీలక బ్యాటిల్స్‌లో ఎవరు విజయం సాధిస్తారో వారిదే చివరికి ఐపీఎల్ 2026 ట్రోఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!