IPL 2024 Playoffs: ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Playoffs Scenario after GT vs KKR Match: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. లీగ్ దశ తుది అంకానికి చేరుకున్నా.. ఇంకా మూడు బెర్తులు ఖరారు కాలేదు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించగా.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మాత్రమే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ ఆరు జట్లలో ఏ టీమ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
RR IPL 2024 Playoffs Chances:
రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఇప్పటికే రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్తుకు ఢోకా లేదు. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. అధికారిక బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం సొంతమవుతుంది. ఒకవేళ పంజాబ్, కోల్‌కతాలతో ఆడే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాజస్థాన్ ముందంజ వేస్తుంది. అయితే చిత్తుగా ఓడకుండా చూసుకుంటే సరిపోతుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
SRH IPL 2024 Playoffs Scenario:
రాజస్థాన్ రాయల్స్ తర్వాత మెరుగైన అవకాశాలు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉన్నాయి. సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. గుజరాత్, పంజాబ్‌లతో ఆడే రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. నెట్ రన్‌రేట్ బాగుంది కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేస్తుంది. అయితే రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం.. ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
CSK IPL 2024 Playoffs Chances:
చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా ప్లేఆఫ్స్ చేరేందుకు మంచి అవకాశం ఉంది. 13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది. యెల్లో ఆర్మీ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్తు సొంతం అవవుతుంది. ఒకవేళ బెంగళూరుపై ఓడితే.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
LSG IPL 2024 Playoffs Scenario:
లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో (ఢిల్లీ, ముంబై) గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే నెట్ రన్‌రేట్ భారీగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. రన్‌రేట్ మైనస్‌లో ఉంది కాబట్టి ఒక్క మ్యాచ్ ఓడినా ముందంజ వేయడం కష్టమే. ఢిల్లీపై ఓడితే ఇంటికి వెళ్లాల్సిందే.
Also Read: IPL 2024 Playoffs: వర్షం వచ్చింది.. గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది!
DC IPL 2024 Playoffs Chances:
ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించింది. నెట్ రన్‌రేట్‌లో బాగా వెనుకబడి ఉంది. చివరి మ్యాచ్‌లో లక్నోపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడితే ఢిల్లీ కథ ముగుస్తుంది.
RCB IPL 2024 Playoffs Scenario:
బెంగళూరు అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు అందుకుంది. బెంగళూరు చివరి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి.. సమీకరణాలు కలిసి వస్తే ముందంజ వేయొచ్చు. నెట్ రన్‌రేట్‌మెరుగ్గా ఉండడం కలిసొచ్చే అంశం. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో జట్లలో ఒక్కటే ముందంజ వేసి రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నై, బెంగళూరు మ్యాచ్ కీలకం అవుతుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!