Site icon NTV Telugu

IPL 2022: తిరుగులేని సన్ రైజర్స్ .. పంజాబ్‌పై 7వికెట్ల తేడాతో గెలుపు

Srh 17

Srh 17

వరుస విజయాలతో ఐపీఎల్ 2022లో తన సత్తా చాటుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆదివారం ఐపీఎల్​ మెగా లీగ్​లో భాగంగా పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్​ నిర్దేశించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలుపొంది తనకు తిరుగులేదని నిరూపించింది. పంజాబ్​ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్​ బ్యాటర్లు అభిషేక్​ శర్మ, విలియమ్సన్లపై విరుచుకుపడ్డారు. అభిషేక్​ శర్మను(31) షారుక్​ఖాన్​ పెవిలియన్​కు పంపాడు. మరో ఓపెనర్​ కెప్టెన్​ విలియమ్సన్​(3) పరుగులే ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్​త్రిపాఠి(34) మెరుగ్గా రాణించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన మార్​క్రమ్​(41), నికోలస్​ పూరన్​(35) నాటౌట్​గా నిలిచి జట్టును గెలిపించారు. పంజాబ్​ బౌలర్లలో రబాడ 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్​ తీశాడు.

తాత్కాలిక కెప్టెన్​ శిఖర్​ ధావన్​(8) పరుగులే చేశాడు. మరో ఓపెనర్​ ప్రభ్​సిమ్రన్​(14) పరుగులకే ఓటయ్యాడు. లివింగ్​ స్టోన్​(60), షారుక్​ ఖాన్​(26) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్‌లో ఉమ్రాన్‌ ఏకంగా 3 వికెట్లు తీసి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇ‍వ్వలేదు. ఆఖరి బంతికి అర్షదీప్‌ కూడా రనౌట్‌ కాగా.. ఈ ఓవర్‌లో పంజాబ్‌ మొత్తం 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.ఇప్పటిదాకా ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగు విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో వుంది.

Exit mobile version