ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించారు. గుజరాత్ ముందు చెన్నై 207 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచారు. చెన్నై బ్యాటింగ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) పరుగులతో రాణించారు. ఆ తర్వాత అజింక్యా రహానే (12) పరుగులు చేసి ఔటయ్యాడు.
Read Also: Atchannaidu: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ.. ఈసారి ఎవరిపై ఫిర్యాదు అంటే..?
అనంతరం బ్యాటింగ్ కు దిగిన శివం దూబే గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, 5 సిక్స్ లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. డారిల్ మిచెల్ (24), సమీర్ రిజ్వీ (14), రవీంద్ర జడేజా (7) పరుగులు చేయడంతో చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది. ఇక.. గుజరాత్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్స్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ సంపాదించారు.
Read Also: AP CEO: వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ భేటీ..
