Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
- 40 పరుగుల తేడాతో లక్నో ఓటమి
- మోసిన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా హిమ్మత్
- మ్యాచ్ పోయింది, లక్నోపై ఫాన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. ఛేదనలో లక్నో సునాయాసం విజయం సాదిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటై.. మరో దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది.ఈ మ్యాచ్‌లో లక్నో తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా హిమ్మత్ సింగ్‌ను పంపడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోసిన్ ఖాన్ స్థానంలో హిమ్మత్ సింగ్‌ను లక్నో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంది. అయితే ఈ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. హిమ్మత్ 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా హిమ్మత్ ప్రభావం చూపలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మ్యాచ్‌యూ మలుపు తిప్పాలి. హిమ్మత్ మాత్రం ఇంపాక్ట్ చూపలేకపోయాడు. దాంతో సోషల్ మీడియాలో అభిమానులు లక్నో జట్టుపై ట్రోల్ చేస్తున్నారు. ‘కీలక సమయంలో హిమ్మత్ సింగ్‌ను ఎందుకు పంపారు?’, ‘జట్టుకు స్పష్టమైన ప్లాన్ లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కొంతమంది అయితే ‘లక్నో ఫ్రాంచైజ్‌కు ఏం చేయాలో తెలియడం లేదు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ అనే వ్యూహం మ్యాచ్‌ను మలుపుతిప్పేలా ఉంటుంది. కానీ సరైన ఆటగాడిని ఎంపిక చేయకపోతే.. అది రివర్స్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో అదే జరిగిందని అభిమానులు అంటున్నారు. మొత్తానికి లక్నో తీసుకున్న ఈ నిర్ణయం జట్టుపై మరింత ఒత్తిడి పెంచింది. ముందు మ్యాచ్‌లలో అయినా ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో జట్టు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Can’t believe LSG sent someone like Himmat Singh as an impact player… like why🤦🏻♂️
This franchise just doesn’t look like it knows what it’s doing anymore. pic.twitter.com/sPtvSAsmE2
— Vipin Tiwari (@Vipintiwari952) April 22, 2026
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!