Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!
- విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న క్లాసెన్
- 9 ఇన్నింగ్స్‌లలో 414 పరుగులు
- సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న క్లాసెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heinrich Klaasen in Hyderabad Restaurant: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మైదానంలో తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 9 ఇన్నింగ్స్‌లలో 414 పరుగులు చేసి.. టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. 59.14 సగటు, 157.41 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ముంబైపై 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌ల మధ్యలో లభించిన విరామాన్ని కాటేరమ్మ కొడుకు క్లాసెన్ కుటుంబంతో కలిసి సరదాగా గడిపాడు.
ఏప్రిల్ 29న ముంబైతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడింది. మే 3న ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతాతో తలపడనుంది. మ్యాచ్‌ల మధ్యలో లభించిన విరామాన్ని హెన్రిచ్ క్లాసెన్ కుటుంబం కోసం వెచ్చిస్తున్నాడు. తన కుమార్తె లాయా క్లాసెన్‌తో కలిసి హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టాడు. సాధారణంగా స్టార్ క్రికెటర్లు బయటికి వెళ్లేటప్పుడు ప్రత్యేక సౌకర్యాలు వినియోగించుకుంటారు. కానీ క్లాసెన్ మాత్రం సాధారణంగా ఆటోలో ప్రయాణిస్తూ నగర అందాలను ఆస్వాదించడం అభిమానులను ఆకట్టుకుంది. కుమార్తెతో కలిసి ఆటోలో కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో క్లాసెన్ ఎంతో సరదాగా, సింపుల్‌గా ఉన్నాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
హెన్రిచ్ క్లాసెన్ కుటుంబం హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్లో కూడా కనిపించింది. కుటుంబంతో కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో క్లాసెన్ మరోసారి చూపించాడు. మైదానంలో అగ్రశ్రేణి బౌలర్లను ధీటుగా ఎదుర్కొనే ఈ స్టార్ ప్లేయర్.. బయట మాత్రం సాధారణ వ్యక్తిలా జీవించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. క్లాసెన్ తన సింప్లిసిటీతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆటోలో కుమార్తెతో రెస్టారెంట్లో ఫ్యామిలీతో చక్కర్లు కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
-
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్‌లో?
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!