Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
- ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్
- మేము చాలా చెత్తగా బౌలింగ్ చేశాం
- 244 రన్స్ కూడా కాపాడుకోకుంటే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Said Hearing Opposition Chants in Wankhede Hurts: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య లాంటి టాప్ బౌలర్లు ఉన్నా.. 244 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోయింది. ముందుగా ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై మరో నిరాశాజనక ఫలితాన్ని ఎదుర్కొన్న తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. తాము చాలా చెత్తగా బౌలింగ్ చేశాం అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్యాటర్లు 243 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం అభిమానుల మద్దతుపై హార్దిక్ పాండ్య స్పందించాడు. ‘మేము ఐపీఎల్ 2026లో ముంబై అభిమానులను ఎంటర్‌టైన్ చేయలేకపోయాము. అయినప్పటికీ వారు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు పేరు సొంత స్టేడియంలో వినిపిస్తే చాలా బాధగా ఉంటుంది. ఆ సమయంలో ఏడుపొచ్చినంత పనవుతుంది. ముంబై అభిమానులకు మరింత వినోదం అందించి వారి ప్రేమను తిరిగి పొందాలి’ అని హార్దిక్ భావోద్వేగంగా చెప్పాడు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తుంటే.. కొందరు ఫ్యాన్స్ సన్‌రైజర్స్.. సన్‌రైజర్స్ అంటూ అరిచారు. దీనిని ఉద్దేశించే హార్దిక్ స్పందించాడు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
‘ఈ మ్యాచ్‌లో మేము భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారు. ప్రత్యర్థి ఓపెనర్లు బాగా ఆడారు. వారి ఇచ్చిన మెరుపు ఆరంభమే మ్యాచ్‌ను మా చేతుల నుంచి దూరం చేసింది. డ్యూ పెద్దగా ప్రభావం చూపలేదు. సన్‌రైజర్స్ బ్యాటర్లు మంచి షాట్లు ఆడారు. మేము కొన్ని చెత్త బంతులు వేసాం. దాంతో వాళ్లు మంచి ఆరంభం సాధించారు. మధ్యలో కొంతవరకు మ్యాచ్‌ను తిరిగి మా వైపు తిప్పుకున్నాం.. కానీ అది సరిపోలేదు. ఈ రోజు బ్యాటింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. 244 పరుగులు చేస్తే సాధారణంగా బౌలర్లు కాపాడతారని నమ్మకం ఉంటుంది. కానీ ఈరోజు అలా జరగలేదు.నా బౌలింగ్ కూడా ఆస్వాదించా. చివరి మూడు బంతులు మినహా నా స్పెల్‌పై సంతోషంగా ఉన్నా’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
ఫీల్డింగ్‌లో చేజారిన అవకాశాలు కూడా ముంబై పరాజయాలకు కారణం అని హార్దిక్ పాండ్య అంగీకరించాడు. ‘ఈ సీజన్ అంతా ఇలానే సాగుతోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటేనే మ్యాచ్ మోమెంటమ్ మారుతుంది. లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయినప్పటికీ మా ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఈ సీజన్‌లో బౌలింగ్లో పెద్దగా ఆప్షన్లు లేవు. కానీ ఏం మార్చుకోవాలో చూడాలి. నెను బౌలర్లపై నిందలు వేయను. మొత్తం జట్టుగా ముంబై ఇండియన్స్ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాం. ఎక్కడ మెరుగుపరుచుకోవాలో విశ్లేషించాలి’ అని స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!