Site icon NTV Telugu

KKR vs GT: లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Gt 10 Overs Score

Gt 10 Overs Score

Gujarat Titans Scored 89 Runs In First 10 Overs: కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి జీటీ ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ జట్టు గెలుపొందాలంటే.. మరో 10 ఓవర్లలో 91 పరుగులు చేయాల్సి ఉంటుంది. శుబ్మన్ గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తుండటంతో.. గుజరాత్ స్కోరు పరుగులు పెడుతోంది. లక్ష్యంలో ఆల్రెడీ హాఫ్ మార్క్ దాటేశారు కాబట్టి.. మిగతా సగం లక్ష్యాన్ని ఛేధించడం గుజరాత్ జట్టుకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో కేకేఆర్ గెలుపొందాలంటే.. బౌలింగ్‌లో బాగా రాణించాలి. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ.. పరుగులు ఇవ్వకుండా, సమయానుకూలంగా వికెట్లు తీస్తూ రావాలి.

Tourism Countries: టూరిస్టులు ఎక్కువగా సందర్శించే టాప్-10 దేశాలు

క్రీజులోకి అడుగుపెట్టిన మొదట్లో గుజరాత్ ఓపెనర్లు నిదానంగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ.. రెండో ఓవర్ నుంచి విజృంభించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. శుబ్మన్ గిల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. బౌండరీల మీద బౌండరీలు బాదుతున్నాడు. శుబ్మన్ ధాటికి తొలి 4 ఓవర్లలోనే గుజరాత్ స్కోరు 41కి చేరుకుంది. అయితే.. 41 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా ఔట్ అయ్యాడు. భారీ షాట్ కొట్టబోగా.. అది నేరుగా హర్షిత్ రానా చేతికి చిక్కింది. సాహా ఔట్ అయ్యాక వచ్చిన హార్దిక్.. మొదట్లో నెమ్మదిగా ఆడినా, ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఓవైపు హార్దిక్, మరోవైపు గిల్.. ఎడాపెడా షాట్లు బాదారు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 50 పరుగులు జోడించారు. అయితే.. 11వ ఓవర్‌లో హార్దిక్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

Aishwarya Rai Bachchan: కళ్లు పెట్టి చూడండి మిత్రోన్.. ఇక వారికి విడాకులు ఇచ్చే పని ఆపండి

Exit mobile version