Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!
- న్యూజీలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్
- ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ
- ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పిన ఫిన్ అలెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో న్యూజీలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతూ శతకం బాదాడు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సులతో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో ఐపీఎల్‌లో కేకేఆర్ స్టార్ ఎన్నో అరుదైన రికార్డులు అందుకున్నాడు. అంతేకాదు కేకేఆర్ చరిత్రలో ఫిన్ అలెన్ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ రికార్డులు ఏంటో చూద్దాం.
ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు:
ఫిన్ అలెన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు బాదాడు. దాంతో కేకేఆర్ తరఫున ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో బ్రెండన్ మెక్‌కల్లమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2008లో బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మెకల్లమ్ 13 సిక్సర్లు బాదాడు. రెండో స్థానంలో ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. అతడు 2018లో చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 11 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు అలెన్ 10 సిక్సర్లతో ఆ జాబితాలో చోటు సంపాదించాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కేకేఆర్ తరఫున సెంచరీ:
కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో కూడా ఫిన్ అలెన్ చేరిపోయాడు. బ్రెండన్ మెకల్లమ్ 2008లో ఆర్‌సీబీపై 158 నాటౌట్, వెంకటేష్ అయ్యర్ 2023లో మబై ఇండియన్స్‌పై 104, సునీల్ నరైన్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌పై 109 పరుగులు చేశారు. తాజాగా ఫిన్ అలెన్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీతో ఈ జాబితాలో చేరాడు.
తొలి న్యూజీలాండ్ బ్యాటర్‌గా చరిత్ర:
ఈ ఏడాది ఫిన్ అలెన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2026 క్యాలెండర్ ఇయర్‌లో మూడు టీ20 శతకాలు చేసిన తొలి న్యూజీలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. పెర్త్ స్కార్చర్స్ తరఫున బీబీఎల్‌లో 101 పరుగులు చేసిన అలెన్.. టీ20 ప్రపంచ కప్ 226లో న్యూజీలాండ్ తరఫున శతకం (100 నాటౌట్) బాదాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున కూడా శతకం సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు.
మెక్‌కల్లమ్ తర్వాత ఫిన్ అలెన్:
ఐపీఎల్ చరిత్రలో శతకం చేసిన రెండో న్యూజీలాండ్ బ్యాటర్‌గా కూడా ఫిన్ అలెన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు అలెన్ కూడా ఆ జాబితాలో చేరి తన ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఒక్క సెంచరీతో ఫిన్ అలెన్ ఎన్నో అరుదైన రికార్డులు అందుకున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!