NTV Telugu Site icon

SHR vs RR: సన్‌రైజర్స్‌ ప్లేయర్లకు చేదు అనుభవం.. స్టార్ ఆటగాడిని తోసేసిన ఫాన్స్!

Srh 1

Srh 1

Fans Round Up Heinrich Klaasen and Jaydev Unadkat in Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఢీకొట్టనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ 3-4 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆర్ఆర్ మ్యాచ్‌కు సమయం ఉండడంతో ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లకు చేదు అనుభవం ఎదురైంది.

తాజాగా కొండాపూర్‌లోని శరత్‌సిటీ క్యాపిటల్‌ మాల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ వెళ్లారు. ఎస్‌ఆర్‌హెచ్ అధికార భాగస్వామిగా ఉన్న రాన్‌ బ్రాండ్‌ స్టోర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, జయదేవ్‌ ఉనద్కత్‌, టీ నటరాజన్‌ పాల్గొన్నారు. అక్కడ పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ప్లేయర్స్ బయటికి రాగా.. అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో క్లాసెన్‌, ఉనద్కత్‌లను ఫాన్స్ చుట్టుముట్టారు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉండడంతో అక్కడ తోపులాట జరిగింది. కొందరు అభిమానులు స్టార్ బ్యాటర్ అయిన క్లాసెన్‌ను తోసేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో వారు అక్కడి నుంచి బయటపడ్డారు.

Also Read: T20 World Cup 2024: శుభ్‌మన్ గిల్ అవసరమా.. సెలక్టర్లు ఆసక్తి ఏంటో అర్ధం కావడం లేదు!

ఫ్యాన్స్ తాకిడి చూసిన దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఒక్కసారిగా బయపడిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024లో క్లాసెన్‌ చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 295 రన్స్ చేశాడు. నేడు సొంత గడ్డపై చెలరేగే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్ 5 గెలిచి.. 10 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచ్‌లలో కనీసం 3 గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ వెళ్లే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులో మెరుగైన స్థితిలో నిలవాలంటే.. నేటి మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం.