రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో సూపర్ విక్టరీ సాధించిన ఆర్సీబీ.. మళ్లీ ప్లేఆఫ్ ఆశలను రేపింది. ఇప్పుడు అభిమానులందరి మదిలో ఇదే ప్రశ్న మెదులుతుంది. అయితే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్-4 లో ఉండాలంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
King Fisher Beers: లైట్ బీర్లు దొరకడం లేదని పాదయాత్ర.. అధికారులకు ఫిర్యాదు
RCB ప్లేఆఫ్‌కు ఎలా చేరగలదు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌లోకి చేరాలంటే.. ఆ జట్టు తన మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఇదే విధమైన అద్భుతమైన విజయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కేవలం గెలిస్తే సరిపోదు కానీ భారీ నెట్ రన్‌రేట్‌తో గెలవాలి. మొదటి రెండు స్థానాలైతే ఆర్సీబీకి అసాధ్యం. ఇక చివరి రెండు స్థానాల్లో నిలవాలంటే.. ఆర్సీబీ 14 పాయింట్లు సాధించాలి. ఇక బెంగళూరు 4వ స్థానంలో నిలుస్తే.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ మిగిలిన టీమ్స్ గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఆ మూడు టీమ్స్ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.
ATM Blast: ఏటీఎంలో చోరీకి ప్రయత్నం.. షార్ట్ సర్క్యూట్ దెబ్బకి..
ఆర్సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. పాయింట్ల పట్టికలో కేవలం ఆరు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాలి. కాగా.. ఆర్సీబీ అన్ని మ్యాచ్‌లు గెలిచిన తర్వాత కూడా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి ఆర్సీబీ అన్ని మ్యాచ్‌లు గెలిచినా, జట్టు మొత్తం 14 పాయింట్లు అవుతుంది. ఆ తర్వాత, ఒక జట్టు 16 పాయింట్ల కంటే ఎక్కువ పాయింట్లతో గ్రూప్ దశను ముగించాలి. అలాగే మిగిలిన 6 జట్లు 12 పాయింట్లు మించకూడదు. ఒకవేళ ఇలా కుదరకపోతే.. 14 పాయింట్లతో చాలా జట్లు ఉంటే.. అప్పుడు ఆర్సీబీ తన నెట్ రన్‌రేట్ మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
