Site icon NTV Telugu

RCB Victory Parade: బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ.. స్వాగతం పలికిన కర్ణాటక డిప్యూటీ సీఎం

Dk

Dk

RCB Victory Parade: దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, జూన్ 3వ తేదీన రాత్రి జరిగిన ఉత్కంఠ భరితమైన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఈరోజు (జూన్4న) బెంగళూరుకు చేరుకున్న ఆర్సీబీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

Read Also: Allahabad High Court: ఆర్మీని కించపరిచేలా మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు.. రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం

అయితే, ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచి బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం బయట వేలాదిగా తరలి వచ్చిన క్రికెట్ లవర్స్ “ఆర్సీబీ! ఆర్సీబీ!” అంటూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే, ఆర్సీబీ ప్లేయర్స్ ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు చెప్పారు. విక్టరీ పరేడ్ లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆర్సీబీ టీమ్ జెండా చేత పట్టుకుని తన వాహనంలో ప్రయాణించారు. మరోవైపు , ఆర్సీబీ విక్టరీ పరేడ్ వేడుకల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం పాల్గొన్నారు.

Exit mobile version