ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే (86) పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు బ్యాటింగ్లో రాణించలేకపోయారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (4), జాస్ బట్లర్ (19) పెద్దగా పరుగులు చేయలేదు. రియాన్ పరాగ్ (27), శుభం దూబే (25) పరుగులు చేశారు. ఆర్ఆర్ బ్యాటింగ్ లో పావెల్ (13), ఫెరీరా (1), అశ్విన్ (2), ట్రెంట్ బౌల్ట్ (2), అవేశ్ ఖాన్ (7) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, రశీక్ సలాం చెరో వికెట్ దక్కింది.
Chandrababu: నాది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ నాకు పునర్జన్మ ఇచ్చాడు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్లో ఓపెనర్లు జేక్ ఫ్రేసర్ (50), అభిషక్ పోరెల్ (65) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించడంతో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత హోప్ (1) పరుగు చేసి నిరాశపరిచాడు. అక్షర్ పటేల్ (15), రిషబ్ పంత్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (41), నయిబ్ (19), రశీక్ సలాం (9), కుల్దీప్ యాదవ్ (5) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలింగ్లో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
KCR : కాంగ్రెస్ ఇస్తానన్న 4 వేల పెన్షన్ వచ్చిందా.. నిరుద్యోగ భృతి వచ్చిందా