NTV Telugu Site icon

DC vs LSG: లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

Dc Won

Dc Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో అత్యధికంగా నికోలస్ పూరన్ (61) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివర్లో అర్షద్ ఖాన్ (58) పరుగులతో చెలరేగాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ మొత్తం లక్నో వైపు తిరిగింది. కానీ.. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి రన్స్ కట్టడి చేశారు.

మరోవైపు.. లక్నో బ్యాటర్లలో మిగతా బ్యాటర్లంతా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో లక్నో మ్యాచ్ ఓడిపోయింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (12), కేఎల్ రాహుల్ (5), మార్కస్ స్టోయినీస్ (5) టాప్ ఆర్డర్ విఫలమయ్యారు. ఆ తర్వాత దీపక్ హుడా డకౌట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన ఆయూష్ బడోని (6) పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా (18), అర్షద్ ఖాన్ (58), యుద్ వీర్ సింగ్ (14), రవి బిష్ణోయ్ (2), నవీన్ ఉల్ హక్ (2) పరుగులు చేశారు.

Lucknow firing: ఇరువర్గాల ఘర్షణ.. తుపాకీతో కాల్పులు

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించారు. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ట్రిస్టన్ స్టబ్స్‌ 25 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఢిల్లీ బ్యాటర్లలో విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ డకౌట్ తో నిరాశపరిచాడు. ఆ తర్వాత.. క్రీజులోకి వచ్చిన షాయ్ హోప్ (38) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. కెప్టె్న్ రిషబ్ పంత్ (33) పరుగులతో రాణించాడు. చివర్లో స్టబ్స్, అక్షర్ పటేల్ (14) పరుగులు చేయడంతో.. లక్నో జట్టుకు భారీ స్కోరును నిర్దేశించారు. లక్నో బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో ఓ వికెట్ సంపాదించారు.

Show comments