ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై గెలిచింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీకి తొలి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ ఓటమితో అటు చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓటమి నమోదైంది.
Off The Record : వైసీపీకి వరంగా మారిన చంద్రబాబు వ్యాఖ్యలు
చెన్నై బ్యాటింగ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (1), రచిన్ రవీంద్ర (2) మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రహానే (45) పరుగులతో రాణించాడు. డారిల్ మిచెల్ (34) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత శివం దూబె (18) పరుగులు చేయగా.. సమీర్ రిజ్వీ డకౌట్ అయ్యాడు. చివరలో రవీంద్ర జడేజా (21), ధోనీ (37) కొస మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలింగ్ లో ముఖేష్ కుమార్ 3 వికెట్లతో చెలరేగాడు. ఖలీల్ అహ్మద్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ సాధించారు.
Off The Record : లేటు వయసులో ఘాటు రాజకీయాలు
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 191 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషబ్ పంత్ (51) పరుగులతో రాణించారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన పృథ్వీషా 43 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించాడు. మిచెల్ మార్ష్ (18), ట్రిస్టన్ స్టబ్స్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (7), అభిషేక్ పోరెల్ (9) పరుగులు చేశారు. ఇక.. సీఎస్కే బౌలర్లలో మతీషా పతిరణా 3 వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా, ముస్తాఫిజుర్ రెహమన్ తలో వికెట్ తీశారు.
