NTV Telugu Site icon

Sanju Samson: ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్‌.. తొలి క్రికెటర్‌గా సంజూ శాంసన్‌!

Sanju Samson

Sanju Samson

Sanju Samson becomes fastest Indian to hit 200 Sixes IPL: రాజస్థాన్‌ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 200 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగళవారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన సంజూ.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. సంజూ కేవలం 159 ఇన్నింగ్స్‌లలో 200 సిక్సర్లను బాదాడు.

ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. 165 ఇన్నింగ్స్‌లో మహీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తాజాగా ధోనీ ఆల్‌టైమ్ రికార్డును సంజూ శాంసన్‌ బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో సంజూ, ధోనీ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ (180 ఇన్నింగ్స్‌), రోహిత్ శర్మ (185 ఇన్నింగ్స్‌), సురేశ్ రైనా (193 ఇన్నింగ్స్‌)లు ఉన్నారు. ఐపీఎల్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన 10వ బ్యాటర్‌గా సంజూ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్టార్లతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ ఉన్నారు.

Also Read: SRH vs LSG: ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌కు చావోరేవో.. గెలిస్తేనే ఆశలు!

ఈ ఎడిషన్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటర్‌గా మరియు కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత అత్యధిక పరుగుల చేసిన మూడవ ఆటగాడిగా ఉన్నాడు. సంజూ 11 మ్యాచ్‌లలో 471 రన్స్ బాదాడు. 2020 సీజన్ తర్వాత స్టీవ్ స్మిత్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాయల్స్‌ను శాంసన్ ముందుండి నడిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024 ప్రదర్శనతోనే టీ20 ప్రపంచకప్ 2024లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యాడు.

Show comments