NTV Telugu Site icon

Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు!

Rohit Sharma

Rohit Sharma

Batters Most Runs Vs Delhi Capitals In IPL History: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీపై 8 రన్స్ చేసిన రోహిత్.. ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఢిల్లీపై 1034 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. విరాట్ ఢిల్లీపై 1030 పరుగులు చేశాడు. కోహ్లీ 28 మ్యాచ్‌ల్లో, రోహిత్ 35 మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ఈ పరుగులు సాధించారు. అజింక్య రహానె (858 పరుగులు), రాబిన్ ఉతప్ప (740 పరుగులు), ఎంఎస్ ధోనీ (709 పరుగులు) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read: Bhatti Vikramarka: శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందంటూ కేసీఆర్ ట్విట్.. అంతా అబద్దమన్న భట్టి

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్వల్ప తేడాతో ఓడిపోయింది. ముందుగా ఢిల్లీ 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. జేక్‌ ఫ్రేజర్‌ (84; 27 బంతుల్లో 11×4, 6×6) చెలరేగాడు. ఛేదనలో ముంబై 247/9కే పరిమితమైంది. తిలక్‌ వర్మ (63; 32 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్‌ పాండ్యా (46; 24 బంతుల్లో 4×4, 3×6) పోరాడారు.