NTV Telugu Site icon

Rishabh Pant: దాని వల్ల ప్రతి రోజూ గండమే: రిషబ్ పంత్

Rishabh Pant Interview

Rishabh Pant Interview

Rishabh Pant on Impact Sub Rule: ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ వల్ల అందరి మనసులో ఆందోళన ఉందని, ప్రతి రోజూ ఓ గండమే అని ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి రిషబ్ పంత్ అన్నాడు. టిమ్‌ డేవిడ్‌ లాంటి హార్డ్‌ హిట్టర్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోతాయన్నాడు. తమకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయని, ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ ముందుకు సాగుతాం అని పంత్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌‌జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 10 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంత్ 19 బంతుల్లో 29 రన్స్ చేశాడు.

Also Read: Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్

మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘స్కోరు బోర్డుపై 250కి పైగా స్కోరు ఉండడంతో చాలా ఆనందం కలిగింది. కానీ ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ వల్ల అందరి మనసులో ఆందోళన ఉంది. ప్రతి రోజూ ఓ గండమే. అలాంటి సమయంలోనే బౌలర్లలో నమ్మకం కలిగించాలి. టిమ్‌ డేవిడ్‌ వంటి హార్డ్‌ హిట్టర్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మా ఓపెనర్ జేక్ ఫ్రేజర్ తొలి రోజు నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రతి గేమ్‌లోనూ మెరుగ్గా ఆడుతున్నాడు. మాకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ టోర్నీలో ముందుకు సాగుతాం’ అని అన్నాడు.

Show comments