Hardik Pandya: టాస్ విషయంలో విమర్శలు.. స్పందించిన హార్దిక్ పాండ్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోవడంపై విమర్శలు వచ్చాయి. మధ్యాహ్నం వేళ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, హార్దిక్ నిర్ణయం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ముంబై కెప్టెన్ హార్దిక్ స్పందించాడు.
‘భారీ ఛేదనలో విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయాం. టోర్నీలో ఇప్పుడు ప్రతి బంతీ కీలకంగా మారింది. గతంలో రెండు ఓవర్లలో ఫలితం తారుమారెయ్యేది. ఇప్పుడు అది రెండు బంతులుగా మారింది. బౌలర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఓడినా మా ఆటతీరు బాగుంది. మిడిల్ ఓవర్లలో ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే గెలిచేందుకు అవకాశాలు ఉండేవి. ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ ఆడిన విధానం అద్భుతం. రిస్క్ తీసుకొని ఆడినట్లు అనిపించింది. యువ క్రికెటర్లలో ఎలాంటి భయం లేదని అతడు మరోసారి నిరూపించాడు’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు!
‘మేం తొలుత బౌలింగ్ ఎంచుకోవడానికిగల కారణాలను చాలా మంది అన్వేషిస్తున్నారు. ఇలాంటి పిచ్‌పై మేం ఎంత భారీ టార్గెట్‌ను ఛేదించగలమో తెలుసుకొనేందుకు ఓ పరీక్ష పెట్టుకున్నాం. ఒక్కోసారి ప్రణాళికలు సక్సెస్ కావు. టాస్ విషయంలో మరోలా చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించలేదు’ అని హార్దిక్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. 3 విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన ఐదు మ్యాచ్‌లలో గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఒక్కటి ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!