MS Dhoni: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ కాదు.. చెన్నై ట్వీట్ వెనక అసలు విషయం ఏంటంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Players Celebrate with the fans at Chepauk: ఆదివారం చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు మైదానంలోనే వేచి ఉండాలని కోరింది. ‘చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ మైదానాన్ని వీడొద్దు. మీకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరికీ ధన్యవాదాలు’ అని చెన్నై పేర్కొంది. ఈ ట్వీట్ చూసిన ఎంఎస్ ధోనీ ఫాన్స్ కంగారు పడ్డారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే చర్చ జోరుగా సాగింది. చివరకు అది కాదని తేలింది.
ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా అభిమానులకు ప్రత్యేకమైన బహుమతులు అందజేసేందుకే సీఎస్కే ఈ ట్వీట్ చేసింది. ప్రతి సీజన్లో సొంత మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన అనంతరం ప్లేయర్స్ అందరూ మైదానం చుట్టూ తిరుగుతూ.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతారు. అంతేకాదు టెన్నిస్ బాల్స్, బ్యాట్స్, టీ షర్ట్స్‌లను వారికి బహుమతులుగా అందజేస్తారు. ఈ సారి కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎంఎస్ ధోనీ టెన్నిస్ బంతులను అభిమానులకు అందజేశాడు. మధ్యలో సురేష్ రైనా వచ్చి కొనసాగించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Janhvi Kapoor: నిజమే.. వారి డ్రెస్సింగ్ స్టైల్‌ని కాపీ కొట్టా: జాన్వీ కపూర్
రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టకలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కినెట్టి మూడో స్థానానికి వచ్చింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించింది. చివరి మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. చివరి లీగ్ మ్యాచ్‌ను మే 18న చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో ఆడనుంది. ఐపీఎల్ 2024లో చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో 7 మ్యాచ్‌లు ఆడి.. 5 విజయాలు సాధించింది. ప్రత్యర్థి మైదానాల్లో 6 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు అందుకుంది.
Etched in our memories! 💛#YellorukkumThanks
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2024
తాజావార్తలు
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!