NTV Telugu Site icon

IPL 2025: మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్లోకి అశ్విన్..?

Ashwin

Ashwin

IPL 2025: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌లో తన సొంత గూటికి చేందుకు సిద్దమైనట్లు సమాచారం. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు గురువారం తమ రిటెన్షన్ లిస్ట్ ను విడుదల చేశాయి. గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్‌‌ను ఆ జట్టు వేలంలోకి విడిచి పెట్టింది. ఆ టీమ్ మొత్తం ఆరుగుర్ని రిటైన్ చేసుకోగా.. రూ.18 కోట్లకు కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌ను రిటైన్ చేసుకోగా.. రూ. 14 కోట్లకు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను అట్టిపెట్టుకుంది. అలాగే, విధ్వంసకర ఆల్‌రౌండర్ షిమ్రాన్ హెట్‌మైర్‌, సందీప్ శర్మను జట్టుతో పాటే కొనసాగించింది.

Read Also: Love Cheating: డబ్బుల కోసం ప్రేమ వల.. రహస్యంగా పెళ్లి.. ఫోటోలతో బ్లాక్ మెయిల్..

ఇక, ఆర్‌టీమ్ కార్డు కూడా లేకపోవడంతో అశ్విన్‌ తిరిగి ఆ జట్టుకు వెళ్లే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే అతన్ని కొనుగోలు చేయాలని చెన్నై ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)లను రిటైన్ చేసుకోగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 55 కోట్ల పర్స్ మనీ ఉంది. రవీచంద్రన్ అశ్విన్ రూ. 5 కోట్ల ధరకు సీఎస్‌కేకు వచ్చే అవకాశం ఉంది. అయితే, అశ్విన్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తోనే తన ఐపీఎల్ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రైజింగ్ పుణే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లకు ఆడారు. ఇప్పటి వరకు 211 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. ఒక హాఫ్ సెంచరీతో 800 రన్స్ చేశాడు. 180 వికెట్లు తీసుకున్నాడు.

Read Also: PGCIL Recruitment: భారీగా ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాల భర్తీ

కాగా, డెవాన్ కాన్వేను ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకున్న సీఎస్‌కే దగ్గరఒక ఆర్‌టీఎమ్ కార్డ్ ఉండగా.. రిషభ్ పంత్‌ను కూడా కొనుగోలు చేసే ఆలోచనలో చెన్నై సూపర్ కింగ్స్ ఉందని కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ధోనీ స్థానాన్ని పంత్‌తో భర్తీ చేయాలనే ఆలోచనతో సీఎస్‌కే ఉన్నట్లు ప్రచారం. సీఎస్‌కే మాజీ బ్యాటర్ సురేశ్ రైనా కూడా పంత్‌ సీఎస్‌కేలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు.

Show comments