NTV Telugu Site icon

Anil Ravipudi-IPL: ఐపీఎల్ మ్యాచ్‌లపై కామెంట్స్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆడుకుంటున్న ఫాన్స్!

Anil Ravipudi

Anil Ravipudi

Director Anil Ravipudi Comments on IPL Matches: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, అతీరా రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రంను నిర్మించారు. మే 10న కృష్ణమ్మ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని హాజరయ్యారు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ‘సత్యదేవ్‌ చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించి.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ కథకైనా, పాత్రకైనా ఆయన కటౌట్‌, వాయిస్‌ బాగా సెట్‌ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు 2-3 రోజులు చూడకుంటే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రండి. క్రికెట్ స్కోర్‌ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు’ అని అన్నారు.

Also Read: T20 World Cup 2024: అతడి కంటే బాగా ఎవరు ఆడగలరు.. బీసీసీపై అంబటి రాయుడు ఆగ్రహం!

అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనిల్‌పై క్రికెట్ ఫాన్స్, నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాలు కూడా నెల రోజుల్లో ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా?.. అప్పుడు చూస్తాం లే అని కౌంటర్ ఇస్తున్నారు. ఇతరుల ఇష్టాయిష్టాలను కించపరచడం కరెక్ట్ కాదని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.