Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం
- వైభవ్ పవర్ హిట్టింగ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నా
- వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో అద్భుతాలు చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనియాడగా.. తాజాగా ఈ లిస్టులో వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా చేరిపోయాడు. వైభవ్ పవర్ హిట్టింగ్‌ను చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, రోజురోజుకు అతడికి అభిమానిగా మారిపోతున్నా అని చెప్పాడు. వైభవ్ లాంటి టాలెంట్ చాలా అరుదుగా పుడుతుందని పేర్కొన్నాడు. వైభవ్‌ను బీసీసీఐ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని గేల్ సూచించాడు. వైభవ్ ఐపీఎల్ 2026 సీజన్లో 13 మ్యాచ్‌లలో 579 పరుగులు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్ 236.32గా ఉంది. ప్రస్తుతం వైభవ్ వద్దనే ఆరెంజ్ క్యాప్ ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను ఎంత ఎక్కువగా చూస్తున్నానో.. అంత ఎక్కువగా అతడికి అభిమానిగా మారిపోతున్నాను. చిన్న వయసులో అతడు ఆడుతున్న తీరు నిజంగా అద్భుతం. ఇంత చిన్న వయసులో టాప్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తాం. ముఖ్యంగా వైభవ్ పవర్ హిట్టింగ్‌కు అసలు పోలికే లేదు’ అని అన్నాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక సిక్సర్లు కొట్టిన యువ ఆటగాడిగా వైభవ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనిపై స్పందించిన గేల్.. ‘ఇప్పుడే ఇలా ఆడుతుంటే భవిష్యత్తులో వైభవ్ ఎంత పెద్ద స్థాయికి వెళ్తాడో ఊహించలేం. వైభవ్‌ను బీసీసీఐ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి టాలెంట్ ప్రతిరోజూ పుట్టదు. ప్రపంచ క్రికెట్లో ఒక తరం తర్వాతే ఇలాంటి ఆటగాళ్లు వస్తారు’ అని అభిప్రాయపడ్డాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో తనను ఎక్కువగా ఆకట్టుకున్న అంశాల గురించి గేల్ వివరించాడు. ‘వైభవ్ బ్యాట్ స్పీడ్ అసాధారణం. షాట్ సెలెక్షన్ చాలా క్లాస్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి భయం లేకుండా ఆడే తీరు అద్భుతం. బ్యాట్ స్పీడ్, షాట్ సెలెక్షన్, నిర్భయమైన బ్యాటింగ్ శైలి.. అన్ని కలిపి తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే అద్భుత ప్రతిభావంతుడిగా అతడిని నిలుపుతున్నాయి’ అని యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ప్రశంసించాడు. ఈ సీజన్లో వైభవ్ ప్రపంచ స్థాయి బౌలర్లపై దూకుడుగా ఆడాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్జే వంటి టాప్ బౌలర్ల బంతులను కూడా సిక్సర్లుగా మలుస్తూ తన పవర్ హిట్టింగ్తో భయపెడుతున్నాడు. తాజాగా లక్నోపై కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి రాయల్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. ఇప్పటికే సునీల్ గవాస్కర్, జస్టిన్ లాంగర్ వంటి దిగ్గజాలు వైభవ్ భవిష్యత్తుపై భారీ అంచనాలు వ్యక్తం చేయగా.. ఇప్పుడు క్రిస్ గేల్ వంటి పవర్ హిట్టింగ్ దిగ్గజం కూడా అతడిని ప్రత్యేక టాలెంట్‌గా అభివర్ణించడం సూర్యవంశీ స్థాయిని మరింత పెంచింది.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!