Site icon NTV Telugu

CSK vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే

Dc Vs Csk

Dc Vs Csk

Chennai Super Kings Won The Toss And Chose To Bat Against DC: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సీఎస్కే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. డీసీ ఆల్రెడీ ఇంటిదారి పట్టింది కాబట్టి, ఆ జట్టుకి ఈ మ్యాచ్ అంత ముఖ్యమైంది కాదు. అంటే.. ఓడినా, గెలిచినా ఆ జట్టుకి కలిగే లాభమేమీ లేదు. కానీ.. సీఎస్కేకి మాత్రం ఈ మ్యాచ్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. టాప్-4లో తన స్థానాన్ని రెండో ప్లేస్‌కే పదిలం చేసుకోవాలంటే.. ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడు నేరుగా క్వాలిఫైయర్-1 ఆడొచ్చు. ఒకవేళ ఓడితే మాత్రం.. అది రెండో స్థానం నుంచి కిందకు దిగజారుతుంది. అప్పుడు కాస్త గందరగోళమైన పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా జరగకుండా ఉండాలంటే మాత్రం.. చెన్నై కచ్ఛితంగా ఈ మ్యాచ్ గెలవాలి.

Minister KTR: వాషింగ్టన్ డీసీలో WTITC స్కై సోర‌ర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్‌

అయితే.. ఇప్పుడు డీసీ ఫుల్ ఫామ్‌లో ఉండటాన్ని చూస్తే, ఆ జట్టుని ఎదుర్కోవడం సీఎస్కేకి సవాలుతో కూడుకున్న పనే. గత మ్యాచ్‌లో డీసీ పంజాబ్ జట్టుని ఎలా మట్టికరిపించిందో అందరూ చూశారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి.. పంజాబ్‌పై 15 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. డీసీ టాపార్డర్ బ్యాటర్లైతే ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అసలే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన కోపంలో ఉన్న వాళ్లు.. చివరి మ్యాచ్‌ల్లో పక్కాగా నెగ్గాలన్న లక్ష్యంతో దూకుడుగా ఆడుతున్నారు. అలాంటి జట్టుని ఓడించాలంటే.. సీఎస్కే భారీ టార్గెట్‌ని నిర్దేశించడంతో పాటు బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. మరి.. ఈ జట్ల మధ్య పోరు ఎలా సాగుతుందో చూడాలి. సీఎస్కే నెగ్గి తన రెండో స్థానాన్ని పదిలం చేసుకుంటుందా? లేక డీసీ నెగ్టి ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలపై నీరుగారుస్తుందా?

Bajrang Punia: బ్రిజ్‌భూషణ్ 15 రూపాయల వ్యాఖ్యలపై పూనియా స్ట్రాంగ్ కౌంటర్

Exit mobile version