Site icon NTV Telugu

CSK vs DC: నత్తనడకన చెన్నై ఇన్నింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Csk 10 Overs

Csk 10 Overs

Chennai Super Kings Scored 66 Runs In First 10 Overs: చెపాక్ హోమ్‌గ్రౌండ్ కావడం, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉండటంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే తాండవం చేస్తుందని అంతా అనుకున్నారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తుందని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా చెన్నై ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతోంది. డీసీ బౌలర్ల ధాటికి ఖాతా తెరవలేకపోతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి కేవలం 66 పరుగులే చేసింది. ఈ సీజన్‌లో మొదటి 10 ఓవర్లలో చెన్నై ఇంత తక్కువ స్కోరు చేయడం ఇదే మొదటిసారి.

Pakistan: విధ్వంసానికి ఆర్ఎస్ఎస్, బీజేపీనే కారణమట.. పాకిస్తాన్ లో వింతవాదన..

తమ జట్టుకి ఎప్పుడూ మంచి శుభారంభాన్ని అందించే రుతురాజ్ (24), కాన్వే (10).. ఈసారి చేతులు ఎత్తేశారు. ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో.. ఆ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తక్కువ స్కోర్లకే వాళ్లిద్దరు పెవిలియన్ బాట పట్టారు. తొలుత కాన్వే 32 పరుగుల వద్ద ఔట్ అవ్వగా.. ఆ తర్వాత 49 పరుగుల వద్ద రుతురాజ్ వెనుదిరిగాడు. కాన్వే వెళ్లాక వచ్చిన రహానే.. ఈ మ్యాచ్‌లో ఆచితూచి ఆడుతున్నాడు. ఇంకా అతడు భారీ షాట్లతో విరుచుకుపడలేదు. రుతురాజ్ పోయాక వచ్చిన మోయీన్ అలీ సైతం.. ఈ మ్యాచ్‌లో ఏమంత ఆశాజనకంగా రాణించలేదు. 12 బంతుల్లో 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు.

Largest Stadiums: దేశంలోని టాప్-10 అతిపెద్ద క్రికెట్ మైదానాలు

Exit mobile version