Delhi Capitals Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Captain is Axar Patel; ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నడిపించనున్నాడు. ఐపీఎల్ 2024 భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూరుతో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు.
‘బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. గత రెండు సీజన్‌లుగా అతడు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా మంచి అనుభవం అతడికి ఉంది. అక్షర్ తెలివైన వ్యక్తి. ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. అక్షర్ నేడు జట్టుతో సమావేశం అవుతాడు. జట్టును బాగా నడిపించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము బ్యాన్‌పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు’ అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రికీ పాంటింగ్ తెలిపాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: KKR vs MI: 9.15 గంటలకు కోల్‌కతా, ముంబై మ్యాచ్ ఆరంభం!
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్ఫటివరకు 12 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే.. కచ్చితంగా బెంగళూరుతో మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ మ్యాచ్ మాత్రమే కాదు మే 14న లక్నోపై కూడా గెలవాల్సి ఉంటుంది. ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ గెలవాలంటే.. కష్టపడాల్సిందే. ఆర్‌సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా లేనట్టే.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!