Site icon NTV Telugu

Delhi Capitals Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌!

Axar Patel Dc

Axar Patel Dc

Delhi Capitals Captain is Axar Patel; ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ నడిపించనున్నాడు. ఐపీఎల్ 2024 భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్‌ యాజమాన్యం ఢిల్లీ కెప్టెన్ రిష‌బ్ పంత్‌పై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూరుతో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా అక్ష‌ర్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్ల‌డించాడు.

‘బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్య‌వ‌హరించనున్నాడు. గత రెండు సీజన్‌లుగా అతడు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా మంచి అనుభ‌వం అతడికి ఉంది. అక్షర్ తెలివైన వ్యక్తి. ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. అక్షర్ నేడు జట్టుతో సమావేశం అవుతాడు. జట్టును బాగా నడిపించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. రిష‌బ్ పంత్ దూరం కావ‌డం మా దురదృష్టం. మేము బ్యాన్‌పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు’ అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రికీ పాంటింగ్ తెలిపాడు.

Also Read: KKR vs MI: 9.15 గంటలకు కోల్‌కతా, ముంబై మ్యాచ్‌ ఆరంభం!

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్ఫటివరకు 12 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిల‌బ‌డాలంటే.. క‌చ్చితంగా బెంగళూరుతో మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ మ్యాచ్ మాత్రమే కాదు మే 14న లక్నోపై కూడా గెలవాల్సి ఉంటుంది. ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ గెలవాలంటే.. కష్టపడాల్సిందే. ఆర్‌సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా లేనట్టే.

Exit mobile version