IPL 2022 : ఫైనల్‌లో స్పెషల్ ఈవెంట్స్.. ఏఆర్ రెహమాన్, రణవీర్ సింగ్.. ఇంకా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆది నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో జట్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడి నెగ్గింది. దీంతో ఫైనల్‌లో గుజరాత్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో నెగ్గి, ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ కు ఘనమైన నివాళి అర్పించాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2008లో మొదలు కాగా, తొలి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వార్న్ కెప్టెన్ గా పనిచేసి తొలి కప్పు తీసుకొచ్చి పెట్టాడు.
ఆ తర్వాత మళ్లీ రాజస్థాన్ జట్టు కప్పును కైవసం చేసుకోలేదు. అయితే.. ఐపీఎల్ ఫైనల్స్ అనంతరం 45 నిమిషాల పాటు ప్రత్యేక కార్యక్రమానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇందులో పాల్గొననున్నారు. అలాగే, జార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఛౌ డ్యాన్స్ కూడా ఉంటుందని సమాచారం. ఇందుకోసం బీసీసీఐ 10 మంది సభ్యుల జార్ఖండ్ ఛౌ డాన్స్ బృందాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా, టీమిండియా మాజీ కెప్టెన్లు ముగింపు వేడకకు హాజరుకానున్నారు. 2019 సీజన్ నుంచి ఐపీఎల్ ముగింపు వేడుక ఇప్పటి వరకు జరుగలేదు.
Also Read
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
తాజావార్తలు
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!