NTV Telugu Site icon

T20 World Cup 2024: ప్రతి ఒక్కరు గర్వపడేలా చేయండి.. భారత జట్టుకు అశ్వత్థామ స్పెషల్‌ మెసేజ్‌ (వీడియో)!

Amitabh Bachchan T20 World Cup 2024

Amitabh Bachchan T20 World Cup 2024

Amitabh Bachchan Ashwatthama’s video for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ భారత జట్టుకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోని అశ్వత్థామ అవతారంలో టీమిండియా క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం కండి’ అని బిగ్‌బీ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం శంఖనాదం మోగింది’ అనే క్యాప్షన్‌తో స్టార్ స్పోర్ట్స్ ఇండియా, కల్కి 2898 ఏడీలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాయి. ఈ వీడియోలో అశ్వత్థామగా అమితాబ్‌ భారత ఆటగాళ్లలో ప్రేరణ నింపుతుండగా.. బ్యాగ్రౌండ్‌లో కల్కి సినిమా మ్యూజిక్‌ ప్లే అవుతోంది. ‘ఇది మహా యుద్ధం. గొప్ప పోరాటం. విజయం ముందు అస్సలు తలవంచొద్దు. ధైర్యంగా ఉండి మీ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించండి. దేశంలోని ప్రతి ఒక్కరు గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి.. అప్పుడే దేశం కోసం మీరు బాగా సన్నద్ధం అవుతారు’ అని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు.

Also Read: Hari Hara Veera Mallu: డైరెక్టర్ క్రిష్‌ని తప్పించలేదు.. తప్పుకున్నాడు!

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ భారత క్రికెటర్లకు సందేశం ఇస్తుండగా.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా తదితర క్రికెటర్లను వీడియోలో చూపించారు. అంతేకాదు 2007లో భారత్ టీ20 ప్రపంచకప్‌ గెలిచిన మొమెంట్స్ కూడా జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన నెటిజెన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అమితాబ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను ఆయన ప్రత్యక్షంగా వీక్షించి ఎంజాయ్ చేస్తారు.

Show comments