ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔట్ కాగా… మరో బ్యాటర్ ట్రేవిస్ హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేశారు.
Read Also: Nirmala sitharaman: కేజ్రీవాల్ అరెస్ట్‌పై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. హెడ్ కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పగా.. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఐపీఎల్ లో హైదరాబాద్ తరుఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. అభిషేక్ ఇన్నింగ్స్ లో 23 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
Read Also: Sachin Tendulkar: సరిగ్గా ఇదే రోజు.. కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది.
