IPL: ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో BCCI కి దెబ్బ మీద దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL మెగా టోర్నీకి సంబందించిన మీడియా హక్కుల వేలంలో BCCI కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బిడ్డర్లు వరుసగా తప్పుకుంటున్నారు. వేల కోట్లు కురుస్తాయని ధీమాగా ఉన్న బోర్డుకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. ఇప్పటికే అమెజాన్, గూగుల్ సాంకేతిక బిడ్లు సమర్పించలేదు. ఇప్పుడు జీ సైతం ప్యాకేజ్-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. దాంతో డిస్నీ స్టార్, రిలయన్స్ వయాకామ్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
మరికొన్ని రోజుల్లో సోనీ నెట్‌వర్క్‌లో జీ విలీనం కాబోతోంది. అలాంటప్పుడు వారికి పోటీలో నిలవడంలో అర్థం లేదని జీ భావిస్తున్నట్టు తెలిసింది. దాంతో ప్యాకేజ్-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. అయితే ‘జీ ఎందుకు బిడ్ వేస్తుంది? వారి భాగస్వామి సోనీతో పోటీకి వస్తారా? అనేది ఇంకా తెలియాల్సివుంది. అయితే తర్వలోనే ఈ రెండు సంస్థలు విలీనం అవుతున్నాయి. అందుకే రేసులో ఉండటం లేదు’ అని జీ ప్రమోటర్ల సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
మీడియా హక్కుల వేలానికి వచ్చిన బిడ్లను BCCI న్యాయ, ఆర్థిక కమిటీలు శుక్రవారం మూల్యాంకనం చేశాయి. సాంకేతికంగా అర్హత సాధించిన కంపెనీలు ఆదివారం బిడ్డింగ్ రౌండ్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు డిస్నీ స్టార్, రిలయన్స్, సోనీ నెట్‌వర్క్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ అర్హత సాధించాయని తెలిసింది. టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో డిజిటల్ హక్కుల్లో పాల్గొంటున్నాయి. సూపర్ స్పోర్ట్ ప్యాకేజ్ డీ బరిలో ఉంది. పోటీదారులు తక్కువమందే ఉన్నారు కాబట్టి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హక్కులు దక్కించుకుంటారని అనిపిస్తోంది.
చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్ IPL ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అన్ని విభాగాలకు కలిపి కాంపోజిట్ బిడ్డింగ్ వేసింది. అయితే ఈ సారి BCCI కనీస ధరను రూ.33,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా ఉమ్మడి బిడ్ వేయకుండా ఈ సారి హక్కులను విడదీసి వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్ సబ్‌కాంటినెట్ డిజిటల్ రైట్స్‌కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్ నాన్ ఎక్స్‌క్లూజివ్ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్, 4 ప్లేఆఫ్ మ్యాచులు, 13 ఈవినింగ్ డబుల్ హెడర్లు ఉంటాయి. సబ్‌కాంటినెట్‌కు ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!