లక్కంటే ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌దే అని చెప్పాలి. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ.13 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అతడిని దక్కించుకుంది. ముందు అన్‌సోల్డ్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్‌కు రెండవ రౌండ్‌లో అదృష్టం వరించింది. అతడి కోసం లక్నో సూపర్ జెయింట్స్, ఎస్‌ఆర్‌హెచ్ పోటీపడ్డాయి. అయితే లక్నో వద్ద సరైన పర్స్ వాల్యూ లేకపోడంతో వెనకడుగు వేసింది. దాంతో లివింగ్‌స్టోన్ ఎస్‌ఆర్‌హెచ్ సొంతమయ్యాడు.
Also Read: Tejasvi Singh-IPL 2026: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!
రెండవ రౌండ్‌లో భారత స్పిన్నర్ రాహుల్ చహర్‌కు అదృష్టం యూ-టర్న్ తీసుకుంది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.20 కోట్లకు కొనుగోలు చేసింది. చహర్ పంజాబ్ కింగ్స్ పోటీపడి వెనక్కి తగ్గింది. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.8.60 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. రచిన్ రవీంద్రను కోల్‌కతా అతడి కనీస ధర రూ.2 కోట్లకు కైవసం చేసుకుంది. ఆకాశ్ దీప్‌ను రూ.కోటికి కోల్‌కతా, మ్యాట్ హెన్రీని రూ.2 కోట్లకు చెన్నై, శివమ్ మావిని రూ.75 లక్షలకు హైదరాబాద్, బెన్ డ్వార్షుయిస్‌ను రూ.4.40 కోట్లకు పంజాబ్, జోర్డాన్ కాక్స్‌ను రూ.75 లక్షలకు ఆర్సీబీ, లుంగి ఎంగిడిని రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగు కుర్రాడు అమన్ రావు పేరాలను రాజస్థాన్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
