IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10 Teams Retained and Released Players List: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. రాబోయే సీజన్ కోసం పది ఫ్రాంచైజీలు తమ జట్లలో కొనసాగించనున్న ఆటగాళ్లతో పాటు విడుదల చేసిన ప్లేయర్ల జాబితాలను బీసీసీఐకి సమర్పించాయి. కొన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. మరికొన్ని ఫ్రాంచైజీలు భారీ మార్పులకు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీని విడుదల చేయడం ఈసారి రిటెన్షన్‌లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇకపై అతడు సీఎస్కేకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
ఎంఎస్ ధోనీతో పాటు ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా తమ తమ జట్ల నుంచి విడుదలయ్యారు. అంతర్జాతీయ సీజన్లో హెడ్, స్టార్క్ తమ పనిభార నిర్వహణపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, స్టార్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేశాయి. 10 ఫ్రాంఛైజీలు వదిలేసిన ఆటగాళ్లలో ప్రశాంత్ వీర్ అత్యంత ఖరీదైన (చెన్నై-రూ.14.2 కోట్లు) ఆటగాడిగా నిలిచాడు.
Also Read
- MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
- SAFF Championship 2026: తొలిసారి ఫైనల్‌కు చేరిన పాకిస్థాన్‌కు షాక్.. SAFF ఛాంపియన్షిప్ 2026 విజేతగా భారత్
- RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
- IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్‌లో LSG..
ఐపీఎల్ 2027 వేలానికి ముందు అత్యధిక పర్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ రూ.47.45 కోట్లతో ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.41.65 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.40.15 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వద్ద కేవలం రూ.8.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేస్తుంది? విడుదలైన స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేస్తాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2027 వేలానికి ముందు పది జట్లలో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు, విడుదలైన ప్లేయర్లు, మిగిలిన పర్స్ మనీ, ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలు తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్:
ప్రస్తుత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, కార్తిక్ శర్మ, నూర్ అహ్మద్, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అన్షుల్ కాంబోజ్, ఆకేల్ హొసేన్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ముఖేశ్ చౌదరి, రాహుల్ చహర్, శ్రేయస్ గోపాల్, లియామ్ లివింగ్‌స్టోన్ (ట్రేడ్), జాక్ ఎడ్వర్డ్స్ (ట్రేడ్).
విడుదలైన ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.2 కోట్లు), మాట్ హెన్రీ (రూ.2 కోట్లు), స్పెన్సర్ జాన్సన్ (రూ.1.5 కోట్లు).
మిగిలిన పర్స్: రూ.28.05 కోట్లు
ఖాళీలు: 6 (విదేశీ ఆటగాళ్లకు 2)
ముంబై ఇండియన్స్:
ప్రస్తుత జట్టు: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ (ట్రేడ్), అశ్వని కుమార్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్, నమన్ ధీర్, క్వింటన్ డికాక్, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, ర్యాన్ రికెల్టన్, శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, తిలక్ వర్మ, విల్ జాక్స్.
విడుదలైన ఆటగాళ్లు: ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), దీపక్ చాహర్ (రూ.9.25 కోట్లు), ఏఎం ఘజన్ఫర్ (రూ.4.8 కోట్లు), అథర్వ అంకోలేకర్ (రూ.30 లక్షలు), కేశవ్ మహారాజ్ (రూ.75 లక్షలు), డానిష్ మలేవార్ (రూ.30 లక్షలు), మయాంక్ మార్కండే (రూ.30 లక్షలు), మయాంక్ రావత్ (రూ.30 లక్షలు), మహమ్మద్ ఇజార్ (రూ.30 లక్షలు).
మిగిలిన పర్స్: రూ.32.6 కోట్లుఖాళీలు: 9 (విదేశీ ఆటగాళ్లకు 2)
కోల్‌కతా నైట్‌రైడర్స్:
ప్రస్తుత జట్టు: అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, హర్షిత్ రాణా, కార్తిక్ త్యాగి, మనీష్ పాండే, ప్రశాంత్ సోలంకి, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సార్థక్ రంజన్, సౌరభ్ దూబే, సునీల్ నరైన్, టిమ్ సీఫర్ట్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
విడుదలైన ఆటగాళ్లు: మతీష పతిరణ (రూ.18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ.9.2 కోట్లు), తేజస్వి సింగ్ దహియా (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), అజింక్య రహానే (రూ.1.5 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ.1 కోటి), బ్లెస్సింగ్ ముజరబానీ (రూ.75 లక్షలు), నవదీప్ సైనీ (రూ.75 లక్షలు), రాహుల్ త్రిపాఠి (రూ.75 లక్షలు), ఉమ్రాన్ మాలిక్ (రూ.75 లక్షలు), దక్ష్ కామ్రా (రూ.30 లక్షలు), లువ్నిత్ సిసోడియా (రూ.30 లక్షలు).
మిగిలిన పర్స్: రూ.41.65 కోట్లు
ఖాళీలు: 8 (విదేశీ ఆటగాళ్లకు 3)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ప్రస్తుత జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, దేవదత్ పడిక్కల్, నువాన్ తుషార, వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ, జోర్డన్ కాక్స్, రసిఖ్ సలామ్ దార్, సుయశ్ శర్మ, విక్కీ ఓస్త్వాల్, అభినందన్ సింగ్, కౌశిక్ చౌహాన్, యశ్ దయాల్.
విడుదలైన ఆటగాళ్లు: మంగేశ్ యాదవ్ (రూ.5.2 కోట్లు), జాకబ్ బెథెల్ (రూ.2.6 కోట్లు), రిచర్డ్ గ్లీసన్ (రూ.1.6 కోట్లు), సాత్విక్ దేశ్వాల్ (రూ.30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ.30 లక్షలు).
మిగిలిన పర్స్: రూ.14.15 కోట్లు
ఖాళీలు: 5 (విదేశీ ఆటగాళ్లకు 1)
పంజాబ్ కింగ్స్:
ప్రస్తుత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కస్ స్టోయినిస్, విష్ణు వినోద్, బెన్ ద్వార్షుయిస్, ముషీర్ ఖాన్, వైశాక్ విజయకుమార్, కూపర్ కొన్నోలీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జేవియర్ బార్ట్లెట్, హార్దిక్ పాండ్యా (ట్రేడ్), ప్రియాంశ్ ఆర్య, యశ్ ఠాకూర్, హర్నూర్ పన్ను, శశాంక్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, సూర్యాంశ్ షెడ్గే.
విడుదలైన ఆటగాళ్లు: నేహాల్ వధేరా (రూ.4.2 కోట్లు), మిచెల్ ఓవెన్ (రూ.3 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు).
మిగిలిన పర్స్: రూ.18.6 కోట్లు
ఖాళీలు: 6 (విదేశీ ఆటగాళ్లకు 2)
గుజరాత్ టైటాన్స్:
ప్రస్తుత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అనుజ్ రావత్, కగిసో రబడా, రాహుల్ తెవాటియా, అశోక్ శర్మ, కుమార్ కుశాగ్ర, రషీద్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, మానవ్ సుతార్, సాయి సుదర్శన్, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ (ట్రేడ్), మహమ్మద్ అర్షద్ ఖాన్, టామ్ బాంటన్, జేసన్ హోల్డర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, జోస్ బట్లర్, ఆర్. సాయి కిశోర్.
విడుదలైన ఆటగాళ్లు: షారుఖ్ ఖాన్ (రూ.4 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ.75 లక్షలు), ల్యూక్ వుడ్ (రూ.2.4 కోట్లు), కుల్వంత్ ఖెజ్రోలియా (రూ.30 లక్షలు).
మిగిలిన పర్స్: రూ.8.75 కోట్లు
ఖాళీలు: 3 (విదేశీ ఆటగాళ్లకు 2)
రాజస్థాన్ రాయల్స్:
ప్రస్తుత జట్టు: అమన్ రావు పెరాలా, బ్రిజేష్ శర్మ, దసున్ షనక, ధ్రువ్ జురెల్, డొనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, మణిమారన్ సిద్ధార్థ్ (ట్రేడ్), మహమ్మద్ షమీ (ట్రేడ్), నాండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, శుభమ్ దూబే, సుశాంత్ మిశ్రా, వైభవ్ సూర్యవంశీ, యశ్ రాజ్ పుంజా, యశస్వి జైస్వాల్.
విడుదలైన ఆటగాళ్లు: షిమ్రోన్ హెట్మయర్ (రూ.11 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ.6.5 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ.2.4 కోట్లు), క్వేనా మఫాకా (రూ.1.5 కోట్లు).
మిగిలిన పర్స్: రూ.27.05 కోట్లు
ఖాళీలు: 6 (విదేశీ ఆటగాళ్లకు 3)
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ప్రస్తుత జట్టు: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, బ్రైడన్ కార్స్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరన్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, క్రాన్స్ ఫులేట్రా, ఈషాన్ మలింగ, టీ. నటరాజన్ (ట్రేడ్), నాథన్ ఎల్లిస్ (ట్రేడ్), ఖలీల్ అహ్మద్ (ట్రేడ్).
విడుదలైన ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), జెరాల్డ్ కోయెట్జీ (రూ.2 కోట్లు), జయదేవ్ ఉనద్కట్ (రూ.1 కోటి).
మిగిలిన పర్స్: రూ.40.15 కోట్లు
ఖాళీలు: 7 (విదేశీ ఆటగాళ్లకు 3)
లక్నో సూపర్ జెయింట్స్:
ప్రస్తుత జట్టు: అబ్దుల్ సమద్, దిగ్వేష్ రాఠీ, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, జోష్ ఇంగ్లిస్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్, కుల్దీప్ యాదవ్ (ట్రేడ్), సామ్ కరన్ (ట్రేడ్), అక్షత్ రఘువంశీ, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, అర్జున్ టెండూల్కర్, మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి.
విడుదలైన ఆటగాళ్లు: ఆవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు), అన్రిచ్ నోర్జే (రూ.2 కోట్లు), వానిందు హసరంగ (రూ.2 కోట్లు).
మిగిలిన పర్స్: రూ.47.45 కోట్లు
ఖాళీలు: 7 (విదేశీ ఆటగాళ్లకు 3)
ఢిల్లీ క్యాపిటల్స్:
ప్రస్తుత జట్టు: ఆశుతోష్ శర్మ, ఔకిబ్ నబీ, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, కైల్ జేమీసన్, లుంగి ఎంగిడి, మాధవ్ తివారీ, ముఖేశ్ కుమార్, పృథ్వీ షా, రిషభ్ పంత్ (ట్రేడ్), సమీర్ రిజ్వీ, త్రిపురాణ విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, జీషాన్ అన్సారీ (ట్రేడ్).
విడుదలైన ఆటగాళ్లు: మిచెల్ స్టార్క్ (రూ.11.75 కోట్లు), నితీశ్ రాణా (రూ.4.2 కోట్లు), పతుమ్ నిస్సాంక (రూ.4 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు).
మిగిలిన పర్స్: రూ.39.5 కోట్లు
ఖాళీలు: 9 (విదేశీ ఆటగాళ్లకు 4)
తాజావార్తలు
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!