Site icon NTV Telugu

IPL 2026 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ ముక్కలు ముక్కలుగా ఎందుకు వస్తోంది.? షాకింగ్ రీజన్స్.!

Tata Ipl

Tata Ipl

IPL 2026 Schedule : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19) సందడి మొదలైంది. అయితే, గతంలోలా కాకుండా ఈసారి బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించకుండా, రెండు విడతలుగా విడుదల చేస్తోంది. మార్చి 6 లేదా 7న మొదటి విడత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలను పరిశీలిస్తే…

Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

1. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం
ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ , పుదుచ్చేరి వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి జట్లకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నికల నిర్వహణలో పోలీసులు , భద్రతా బలగాలు నిమగ్నమై ఉండటం వల్ల, అదే సమయంలో స్టేడియంల వద్ద భారీ భద్రతను కల్పించడం సవాలుగా మారుతుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పోలింగ్ తేదీలను ప్రకటించిన తర్వాతే, ఆయా నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీ వస్తుందని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

2. T20 వరల్డ్ కప్ , స్టేడియంల సర్దుబాటు
ఐపీఎల్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే (మార్చి 8) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముగుస్తుంది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా , చెన్నై వంటి ప్రధాన స్టేడియంలు ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ స్టేడియంలను అంతర్జాతీయ టోర్నమెంట్ మోడ్ నుండి ఐపీఎల్ బ్రాండింగ్‌కు మార్చడానికి, పిచ్‌లను తిరిగి సిద్ధం చేయడానికి గ్రౌండ్ స్టాఫ్‌కు కొంత సమయం అవసరం. రెండు విడతల షెడ్యూల్ వల్ల ఆయా స్టేడియంలకు తగినంత సమయం దొరుకుతుంది.

3. ఇతర ఫ్రాంచైజీల హోమ్ గ్రౌండ్ సమస్యలు
రాజస్థాన్ రాయల్స్ (RR) తమ హోమ్ గ్రౌండ్ అయిన జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటోంది. దీంతో వారు కొన్ని మ్యాచ్‌లను గౌహతి లేదా పూణేలో నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా తమ హోమ్ మ్యాచులలో కొన్నింటిని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని భావిస్తోంది. ఇలాంటి వేదికల మార్పులపై స్పష్టత రావడానికి కూడా కొంత సమయం పడుతుంది.

మొదటి విడతలో సుమారు 15-20 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల కానుంది. ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మే 31న జరిగే ఫైనల్ వరకు పూర్తి షెడ్యూల్ అందుబాటులోకి వస్తుంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..

Exit mobile version