IPL Owners List 2026: 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో తెలుసా?.. ఫ్రాంచైజీల వెనుక ఉన్న పెద్ద పేర్లు ఇవే!
- చేతులు మారిన ఆర్సీబీ, ఆర్ఆర్ ప్రాంఛైజీలు
- ఆర్సీబీని చేజిక్కించుకున్న 4 సంస్థలు
- కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియంకు ఆర్ఆర్ సొంతం
- 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Owners List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌లలో ఒకటి. ఈ లీగ్‌లో ఆడే ప్రతి జట్టుకు ఎంతో క్రేజ్ ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు వేరే యాజమాన్యాల అధీనంలోకి వెళ్లిపోయాయి. ఆర్సీబీని రూ.16,706 కోట్ల ధరకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. రూ.15,300 కోట్లకు రాజస్థాన్ ఫ్రాంఛైజీని ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది.
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీల అమ్మకాల నేపథ్యంలో 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో అని క్రికెట్ అభిమానులు వెతుకుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన యజమాన్య నిర్మాణం ఉండటం ఐపీఎల్ ప్రత్యేకత. భారీ వ్యాపార సామ్రాజ్యాలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు ఐపీఎల్ ప్రాంచైజీల వెనుక ఉన్నారు. ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు యజమాన్యం నీతా అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, జూహీ చావ్లాతో పాటు వారి సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమాన్యం వహిస్తోంది.
Also Read
- Allu Arjun - Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
- Rohit Sharma: "నన్ను క్షమించు.." మహిళా అభిమానికి 'హిట్ మ్యాన్' స్పెషల్ రిక్వెస్ట్..!
- Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
- MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా మిస్టర్ కూల్.!
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్రస్తుతం కల్ సోమని నేతృత్వంలోని యాజమాన్యంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 4 సంస్థల యాజమాన్యంకు చెందినది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టును కలానిథి మారన్ ఆధ్వర్యంలోని సన్ టీవీ నెట్వర్క్ నిర్వహిస్తోంది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుకు బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో పాటు వాడియా గ్రూప్, మొహిత్ బర్మన్కు చెందిన కెపిహెచ్ డ్రీమ్ క్రికెట్ లిమిటెడ్ యజమాన్యం ఉంది.
Also Read: Ben Duckett IPL Ban: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. బెన్ డకెట్పై రెండేళ్ల నిషేధం!
డిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టును పార్థ్ జిందాల్ ఆధ్వర్యంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్వహిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకా, ఆయనకు చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ నేతృత్వంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు ఎన్. శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని ఇండియా సిమెంట్స్‌కు చెందినది. ఇక గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టును సిద్ధార్థ్ పటేల్‌కు చెందిన సీవిసీ క్యాపిటల్ పార్ట్నర్స్ నిర్వహిస్తోంది. ఐపీఎల్ జట్ల వెనుక ఉన్న యజమానులు చూస్తే.. కార్పొరేట్ ప్రపంచం, సినీ రంగం, అంతర్జాతీయ పెట్టుబడిదారులు అన్నీ కలిసి ఈ లీగ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లినట్టు స్పష్టమవుతోంది. ఈ బలమైన యాజమాన్యాల వల్లే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత పాపులర్, విలువైన లీగ్‌గా ఎదిగింది.
తాజావార్తలు
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?