Ben Duckett IPL Ban: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. బెన్ డకెట్‌పై రెండేళ్ల నిషేధం!
- ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ కీలక నిర్ణయం
- ఐపీఎల్ 2026 నుంచి తప్పుకుంటున్న డకెట్
- బెన్ డకెట్‌పై రెండేళ్ల నిషేధం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Duckett withdraws from IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2026 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. గత ఏడాది వేలంలో రూ.2 కోట్లకు డకెట్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ.. ఈ సీజన్‌లో అతడిపై ఆశలు పెట్టుకుంది. తీరా లీగ్ ఆరంభానికి ముందు డకెట్ షాక్ ఇచ్చాడు.
‘ఈ నిర్ణయం చాలా కఠినమైనది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి క్షమాపణలు చెబుతున్నా. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్, ఇందులో ఆడటం గొప్ప అవకాశం. కానీ ప్రస్తుతం నా కెరీర్ దృష్ట్యా ఇంట్లో ఉండి రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ చేయడం అవసరమని భావించాను. ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నా కల. రాబోయే టెస్టు సిరీస్‌ల్లో మెరుగ్గా రాణించాలంటే మానసికంగా, శారీరకంగా సన్నద్ధతతో ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైందే అని భావిస్తున్నా’ అని బెన్ డకెట్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
- Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
- WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
2025 ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం.. వేలంలో ఎంపికైన విదేశీ ఆటగాళ్లు సరైన కారణం లేకుండా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే అతడిపై రెండేళ్లు నిషేధం పడుతుంది. గాయాలు లేదా వైద్య సంబంధిత కారణాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది. బెన్ డకెట్ మినహాయింపు పరిధిలోకి రాడు. కాబట్టి డకెట్ వచ్చే రెండేళ్లు (2027, 2028) ఐపీఎల్‌కు దూరం కావాల్సి ఉంటుంది. మొత్తానికి డకెట్ తీసుకున్న ఈ నిర్ణయం అతడి ఐపీఎల్ భవిష్యత్తుపై అనిశ్చితిని నెలకొల్పింది. భవిష్యత్తులో అతడు మళ్లీ ఈ లీగ్‌లో కనిపిస్తాడా లేదా అనేది చూడాలి.
గత యాషెస్ సిరీస్‌లో బెన్ డకెట్ నిరాశపరిచాడు. ఐదు టెస్టుల్లో 202 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన ఆటను మెరుగుపరుచుకోవడానికి కౌంటీ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని అతడు నిర్ణయించుకున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్ కోచ్ పీటర్ మూర్స్‌తో కలిసి పనిచేస్తూ తన లోపాలను సరిదిద్దుకోవాలని భావిస్తున్నాడు.
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..