Site icon NTV Telugu

IPL Owners List 2026: 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో తెలుసా?.. ఫ్రాంచైజీల వెనుక ఉన్న పెద్ద పేర్లు ఇవే!

Ipl Owners List 2026

Ipl Owners List 2026

IPL 2026 Owners List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌లలో ఒకటి. ఈ లీగ్‌లో ఆడే ప్రతి జట్టుకు ఎంతో క్రేజ్ ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు వేరే యాజమాన్యాల అధీనంలోకి వెళ్లిపోయాయి. ఆర్‌సీబీని రూ.16,706 కోట్ల ధరకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బోల్ట్‌ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్‌ సంస్థలు చేజిక్కించుకున్నాయి. రూ.15,300 కోట్లకు రాజస్థాన్‌ ఫ్రాంఛైజీని ప్రముఖ టెక్‌ వ్యాపారవేత్త కల్‌ సోమని నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది.

రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రాంచైజీల అమ్మకాల నేపథ్యంలో 10 ఐపీఎల్ జట్ల యజమానులు ఎవరో అని క్రికెట్ అభిమానులు వెతుకుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన యజమాన్య నిర్మాణం ఉండటం ఐపీఎల్ ప్రత్యేకత. భారీ వ్యాపార సామ్రాజ్యాలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు ఐపీఎల్ ప్రాంచైజీల వెనుక ఉన్నారు. ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు యజమాన్యం నీతా అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, జూహీ చావ్లాతో పాటు వారి సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమాన్యం వహిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్రస్తుతం కల్‌ సోమని నేతృత్వంలోని యాజమాన్యంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 4 సంస్థల యాజమాన్యంకు చెందినది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టును కలానిథి మారన్ ఆధ్వర్యంలోని సన్ టీవీ నెట్‌వర్క్ నిర్వహిస్తోంది. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుకు బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో పాటు వాడియా గ్రూప్, మొహిత్ బర్మన్‌కు చెందిన కెపిహెచ్ డ్రీమ్ క్రికెట్ లిమిటెడ్ యజమాన్యం ఉంది.

Also Read: Ben Duckett IPL Ban: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. బెన్‌ డకెట్‌పై రెండేళ్ల నిషేధం!

డిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టును పార్థ్ జిందాల్ ఆధ్వర్యంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్వహిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) యజమాని సంజీవ్ గోయెంకా, ఆయనకు చెందిన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ నేతృత్వంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు ఎన్. శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని ఇండియా సిమెంట్స్‌కు చెందినది. ఇక గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టును సిద్ధార్థ్ పటేల్‌కు చెందిన సీవిసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ నిర్వహిస్తోంది. ఐపీఎల్ జట్ల వెనుక ఉన్న యజమానులు చూస్తే.. కార్పొరేట్ ప్రపంచం, సినీ రంగం, అంతర్జాతీయ పెట్టుబడిదారులు అన్నీ కలిసి ఈ లీగ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లినట్టు స్పష్టమవుతోంది. ఈ బలమైన యాజమాన్యాల వల్లే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత పాపులర్, విలువైన లీగ్‌గా ఎదిగింది.

 

Exit mobile version