Site icon NTV Telugu

IPL 2026 Mini Auction: అయ్య బాబోయ్, మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!

Ipl 2026 Mini Auction

Ipl 2026 Mini Auction

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలం కోసం ఏకంగా 1,355 మంది ఆటగాళ్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. క్రిక్‌బజ్ ప్రకారం ఆటగాళ్ల జాబితా లిస్ట్ 13 పేజీలు ఉండడం విశేషం. ఓ మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ బాగా ఉండనుంది. ఇందుకు కారణం వేలంలో సీనియర్ ఆటగాళ్లు, ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఉండడమే. మినీ ఆక్షన్ కోసం భారత, విదేశీ ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం.

భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్, కేస్భరత్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ మావి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి అనేక మంది స్టార్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ వేలంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. జేమీ స్మిత్, వానిందు హసరంగ, మహీశ పతిరాణా, అన్ఱిజ్ నోర్జ్, కోట్జీ, లియామ్ లివింగ్‌స్టన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. వివాహం కారణంగా జోష్ ఇంగ్లిస్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు.

Also Read: IND vs SA: భారత జట్టులో ఏదో తప్పు జరుగుతోంది.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

హిట్టర్స్ జానీ బెయిర్‌స్టో, రచిన్ రవీంద్ర సహా ముజీబ్, నవీన్ ఉల్-హక్ కూడా వేలం జాబితాలో ఉన్నారు. గత కొన్ని వేలంలలో అమ్ముడుపోని స్టీవ్ స్మిత్ మరోసారి నమోదు చేసుకోవడం విశేషం. మలేషియా ఆటగాడు విరందీప్ సింగ్ కూడా వేలానికి నమోదు చేసుకున్నాడు. త్వరలోనే బీసీసీఐ అన్ని బేస్ ధరలతో కూడిన పూర్తి జాబితాను విడుదల చేయనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం అతిపెద్ద బ్యాలెన్స్‌ను కలిగి ఉంది. వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్‌తో సహా అనేక మంది కీలక ఆటగాళ్లను కేకేఆర్ విడుదల చేయడమే ఇందుకు కారణం. కేకేఆర్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ రెండవ అతిపెద్ద బ్యాలెన్స్ ఉంది. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్ సహా మతిషా పతిరానాను విడుదల చేసింది. మొత్తం 77 స్లాట్లు ఖాళీగా ఉండగా.. అందులో విదేశీ ప్లేయర్స్ స్లాట్లు 31.

 

Exit mobile version