Site icon NTV Telugu

IPL 2024: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్.. వాతావరణం ఎలా ఉందంటే..?

Csk Vs Rcb

Csk Vs Rcb

CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌ ఇవాళ చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ టీమ్స్ మధ్య జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌ నేటి రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కాగా, మ్యాచ్‌కు ముందు సీజన్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, ఎఆర్‌ రెహ్మాన్‌, సోనూ నిగమ్‌ పెర్ఫార్మ్‌ చేయబోతున్నారు.

ఇక, సీఎస్‌కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం​ ఆటకు అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు అని చెప్పింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం నాడు రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్‌ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొనింది. మ్యాచ్‌ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది.. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు అని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పుకొచ్చారు.

Read Also: Operation Valentaine OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

అయితే, చెపాక్‌ పిచ్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండిటికీ అనుకూలిస్తుంది.. అలాగే, తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్‌ క్రమంగా స్నిన్‌కు అనుకూలింది. ఈ పిచ్‌పై టార్గెట్ ఛేదించడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసే టీమ్ కే విజయావకాశాలు ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల స్పిన్నర్లు చెలరేగే ఛాన్స్ ఉంది. అలాగే, ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై మంచి రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో 31 సార్లు పోటీ పడగా.. సీఎస్‌కే 20, ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించాయి. అయితే, ఓ మ్యాచ్‌లో టై అయింది. ఇక, ఆర్సీబీపై సీఎస్‌కే పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది.. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇందులో ఏకంగా సీఎస్కే ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆర్సీబీ గెలిచింది.

Exit mobile version