Site icon NTV Telugu

Guinness Record: గిన్నిస్ రికార్డుల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..?

Guinnis Record

Guinnis Record

Guinness Record: ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్ మరే లీగ్‌కు ఉండదు. తాజాగా ఐపీఎల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది మే నెలలో ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరు కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 ఫైనల్‌లో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏకంగా 1,01,566 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్లే గుర్తించి బీసీసీఐకి అవార్డును కూడా అందజేశారు.

Read Also: Snake Stolen Chappal: ఇదేం పామురా బాబూ.. చెప్పుతో పరార్

దీంతో టీ20 మ్యాచ్‌ల చరిత్రలోనే అత్యధికంగా హాజరైనందుకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఆదివారం ప్రకటించారు. భారత్‌లో జరిగిన మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బీసీసీఐకి మద్దతు ఇచ్చిన అభిమానులకు ఈ అవార్డు అంకితమని ఆయన తెలిపారు. అటు మోతెరా స్టేడియం నిర్వాహకులకు, ఐపీఎల్ నిర్వాహకులకు కూడా అభినందనలు తెలియజేశారు. కాగా గతంలో అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం (ఇప్పుడు నరేంద్రమోదీ స్టేడియం) సీటింగ్ కెపాజిటీ 49వేలు మాత్రమే ఉండేది. కానీ స్టేడియాన్ని ఆధునీకరణ చేసిన తర్వాత లక్షా 32వేలకు సీటింగ్ కెపాసిటీని పెంచారు. అటు వచ్చే ఏడాది ఇదే వేదికగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరుగనుంది.

Read Also: Relationship: భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే కారణాలు ఇవే..!!

Exit mobile version